Xiaomi 17T Series : కొత్త ఫోన్ కావాలా? అద్భుతమైన ఫీచర్లతో షావోమీ 17T సిరీస్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర జస్ట్..!

Xiaomi 17T Series : ప్రపంచ మార్కెట్లలో షావోమీ 17, షావోమీ 17T ప్రో సిరీస్ లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్ల స్పెసిఫికేషన్లు రివీల్ అయ్యాయి. భారత మార్కెట్లో జూన్ 4వ తేదీన షావోమీ 17, షావోమీ ప్రో ఫోన్లు రిలీజ్ కానున్నాయి. పూర్తి వివరాలివే..

Xiaomi 17T Series

  • షావోమీ నుంచి సరికొత్త ఫోన్లు వచ్చేశాయ్
  • షావోమీ 17టీ, షావోమీ 17టీ ప్రో సిరీస్ లాంచ్
  • జూన్ 4వ తేదీన భారత మార్కెట్లో ఈ సిరీస్ రిలీజ్

Xiaomi 17T Series : షావోమీ నుంచి 17T, 17T ప్రో గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ అయ్యాయి. ఈ రెండూ అడ్వాన్స్ మీడియాటెక్ డైమన్షిటీ ప్రాసెసర్‌లతో రన్ అవుతాయి. ఈ ఫోన్లలో లిసియా ట్యూన్డ్ కెమెరాలు, LPDDR5x ర్యామ్, యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్ వంటి మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. ఈ రెండు ఫోన్లకు సంబంధించి పూర్తి ఫీచర్లు, స్పెషిఫికేషన్లపై ఓసారి లుక్కేయండి.

షావోమీ 17టీ ధర, స్పెసిఫికేషన్లు :
షావోమీ 17టీ వైలెట్, ఓపల్ వైట్, బ్లూ బ్లాక్ షేడ్స్‌లో లభిస్తుంది. 12GB + 256GB మోడల్ ధర ఈయూఆర్ 749.99 (సుమారు రూ. 83,500) నుంచి  (Xiaomi 17T Series) ప్రారంభమవుతుంది. షావోమీ 17టీ 6.59-అంగుళాల (2756×1268 పిక్సెల్స్) 1.5K రిజల్యూషన్ ఎల్టీపీఎస్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది.

120Hz రిఫ్రెష్ రేట్, 3500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్, 480Hz టచ్ శాంప్లింగ్ రేట్, 3840Hz పీడబ్ల్యూమ్ డిమ్మింగ్ డీసీ డిమ్మింగ్, 100శాతం డీసీఐ-పీ3 కలర్ గామట్, HDR10+ సపోర్ట్, డాల్బీ విజన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్ ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 12GB వరకు LPDDR5x ర్యామ్, 512GB యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్ అందిస్తుంది. షావోమీ 17T ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది.

ఇందులో ఎఫ్/1.7 అపర్చర్, ఓఐఎస్, ఎల్ఈడీ ఫ్లాష్‌తో 50MP లైకా లైట్ ఫ్యూజన్ 800 ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో 12MP లైకా అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 5x ఆప్టికల్ జూమ్, ఎఫ్/3.0 అపర్చర్ OISతో 50MP లైకా పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 32MP ఎఫ్/2.2 కెమెరా ఉంది.

Read Also :  Upcoming Smartphones : మొబైల్ లవర్స్ బిగ్ అలర్ట్..! జూన్‌లో ఎంట్రీ ఇవ్వనున్న 5 పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్లు ఇవే

షావోమీ 17టీలో 6500mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ఉన్నాయి. హై-వైబ్రేషన్ ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటార్, స్టీరియో స్పీకర్లు, USB-C పోర్ట్, NFC, బ్లూటూత్ v6.0, 5G, Wi-Fi 6E, GPS, ఐఆర్ బ్లాస్టర్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత షావోమీ లేటెస్ట్ హైపర్ఓఎస్ 3.0 ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ IP68 రేటింగ్‌ కూడా అందిస్తుంది. ఇందులో ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది.

షావోమీ 17టీ ప్రో ధర, స్పెసిఫికేషన్లు :
షావోమీ 17టీ ప్రో డీప్ బ్లూ, డీప్ వైలెట్ బ్లాక్ షేడ్స్‌లో లభిస్తుంది. 12GB + 256GB మోడల్ ధర ఈయూఆర్ 899.99 (సుమారు రూ. 1,00,195) నుంచి ప్రారంభమవుతుంది. షావోమీ 17టీ ప్రో 6.83-అంగుళాల (2772×1280 పిక్సెల్స్) అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది.

144Hz వరకు రిఫ్రెష్ రేట్, 3500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్, 12-బిట్ కలర్స్, HDR10+, డాల్బీ విజన్, 480Hz టచ్ శాంప్లింగ్ రేట్, డీసీ డిమ్మింగ్ సపోర్ట్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

షావోమీ 17టీ ప్రో, మీడియాటెక్ డైమన్షిటీ 9500 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 12GB వరకు LPDDR5x ర్యామ్, 1TB వరకు యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ OS3తో ​​వస్తుంది.

కెమెరాల విషయానికొస్తే.. :
షావోమీ 17టీ ప్రోలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో లైట్ ఫ్యూజన్ 950 సెన్సార్, OIS, ఎల్ఈడీ ఫ్లాష్, లైకా సుమ్మిలక్స్ లెన్స్‌తో 50MP ఎఫ్/1.67 ప్రైమరీ కెమెరా, 12MP లైకా ఎఫ్/2.2 అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, ఎఫ్/3.0 అపర్చర్, OISతో 50ఎంపీ 5ఎక్స్ లైకా పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ఈ ఫోన్ ఫ్రంట్ సైడ్ 32ఎంపీ ఎఫ్/2.2 సెన్సార్‌తో వస్తుంది.

షావోమీ 17టీ ప్రో 7000mAh బ్యాటరీతో వస్తుంది. 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్, 22.5W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఇందులో డాల్బీ అట్మోస్‌తో స్టీరియో స్పీకర్లు, IP68 రేటింగ్ పైన ఐఆర్ బ్లాస్టర్ ఉన్నాయి. కనెక్టివిటీ విషయానికి వస్తే.. 5జీ SA/NSA, Wi-Fi 7, బ్లూటూత్ v6.0, బీడౌ, గెలీలియో, గ్లోనాస్, GPS (L1 + L5),నావిక్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ NFC సపోర్టు కూడా అందిస్తుంది.