YouTube View Count Rule : యూట్యూబ్ కొత్త రూల్.. వీడియో క్లిక్ చేస్తే చాలు.. వెంటనే వ్యూ కౌంట్.. అసలు ట్విస్ట్ ఇదే!
YouTube View Count Rule : యూట్యూబ్ కొత్త వ్యూ కౌంటింగ్ రూల్ తీసుకువస్తోంది. వీడియో క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ ఫ్రేమ్ నుంచే వ్యూ కౌంట్ కానుంది. క్రియేటర్లకు లాభమా? నష్టమా? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
- Sreehari A
- Updated on- August 19, 2026 / 04:23 PM IST
YouTube View Count Rule
- యూట్యూబ్ కొత్త రూల్ వస్తోంది.. వ్యూ కౌంటింగ్‌లో బిగ్ ఛేంజ్
- వీడియో క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ ఫ్రేమ్ నుంచే వ్యూ కౌంట్
- ఆగస్టు 24 నుంచి ఈ కొత్త రూల్ అమల్లోకి రానుంది
- క్రియేటర్లకు వ్యూస్ పెరుగుతాయి.. కానీ, రెవిన్యూ మాటేంటి?
YouTube View Count Rule : యూట్యూబ్ కొత్త రూల్ వస్తోంది.. ఆగస్టు 24 నుంచి ఈ కొత్త రూల్ అప్లయ్ కానుంది. యూట్యూబ్ వీడియోల వ్యూస్ విషయంలో బిగ్ ఛేంచ్ రానుంది. ఇకపై వ్యూస్ ఒకప్పటిలా కాదు.. వ్యూస్ లెక్కించే విధానం పూర్తిగా మారనుంది.
ఇకపై 30 సెకన్ల వాచ్ టైమ్ కాదు :
ఇప్పటివరకూ యూట్యూబ్ వీడియోలకు వ్యూస్ మొదటి 30 సెకన్ల నుంచే కౌంట్ పడేది. ఇప్పుడు అలా కాదు.. ఫస్ట్ ఫ్రేమ్ నుంచే వ్యూ కౌంట్ కానుంది. అంటే.. యూజర్ వీడియో మీద క్లిక్ చేస్తే చాలు.. అక్కడి నుంచే పబ్లిక్ వ్యూగా కౌంట్ అవుతుంది అనమాట..
షార్ట్ వీడియోలు, లాంగ్ ఫారమ్ వీడియోలు, లైవ్ స్ట్రీమింగ్ వంటి వీడియోలకు ఈ కొత్త రూల్ వర్తించనుంది. గతంలో లాంగ్ వీడియోలకు కనీసం 30 సెకన్ల వాచ్ టైమ్ తప్పనిసరిగా ఉండేది. అప్పుడే అది వ్యూ కౌంట్ అయ్యేది. ఇప్పుడు అలా కాదు.. వీడియో క్లిక్ చేసిన వెంటనే వ్యూ కౌంట్ స్టార్ట్ అవుతుంది.
క్రియేటర్లకు లాభామా? నష్టమా? :
ఒక్కమాటలో చెప్పాలంటే యూట్యూబ్ క్రియేటర్లకు పండగే.. ఛానళ్లలో వీడియోలకు ఫుల్ వ్యూస్ పెరిగిపోతాయి.. వ్యూస్ పెరిగితే జనాలు చూసిన తెగ చూసేస్తున్నారని కాదు.. జస్ట్ వీడియో ప్లే అవుతుందని అర్థం.. షార్ట్ వీడియోలకు ఇదివరకే ఈ వ్యూ కౌంటింగ్ అమల్లో ఉంది. యూట్యూబ్ తమ ప్లాట్ ఫారంపై అన్ని వీడియో ఫార్మాట్లకు ఒకే తరహా వ్యూ కౌంటింగ్ విధానం తీసుకురావాలని భావిస్తోంది. అందుకే ఈ వ్యూ కౌంటింగ్ విధానాన్ని అన్ని వీడియో ఫార్మాట్లకు కూడా విస్తరిస్తోంది.
ఈ కొత్త మార్పుతో యూట్యూబ్ క్రియేటర్లపై ప్రభావం పడుతుందా? అంటే ఉండదనే చెప్పాలి.. యూట్యూబ్ పార్టనర్ ప్రొగ్రామ్ (YPP) అర్హతలపై కూడా ఎఫెక్ట్ ఉండదు. యూట్యూబ్ అనలిటిక్స్ లో వాచ్ టైమ్, ఎంగేజ్ మెంట్ సపరేటుగానే ట్రాక్ చేస్తోంది.
పాత తరహా వ్యూ కౌంటింగ్ ఎంగేజ్డ్ వ్యూస్ అనే అనలిటిక్స్ లో సపరేటుగా చూపిస్తోంది. తద్వారా క్రియేటర్లకు వ్యూ కౌంటింగ్ వాచ్ టైమ్ వివరాలను చూసేందుకు ఈజీగా ఉంటుంది. క్రియేటర్లు ఈ మెట్రిక్ ను యూట్యూబ్ అనలిటిక్స్ అడ్వాన్స్ మోడ్ కింద చూడొచ్చు.
అయితే, ఇకపై వీడియో పబ్లిక్ వ్యూ కౌంట్, ఎంగేజ్డ్ వ్యూస్ ఒకేలా ఉండవు. కొత్త వ్యూ కౌంటింగ్ విధానం ద్వారా మానిటైజేషన్ పై ఎఫెక్ట్ పడుతుందా అంటే.. పడదనే యూట్యూబ్ చెబుతోంది. మానిటైజేషన్ కోసం ఎంగేజ్డ్ షార్ట్స్ న్యూస్, ఎంగేజ్డ్ వాచ్ అవర్స్ అనే పదాలను వాడుతోంది. యూట్యూబ్, YPP అవసరాలకు అనుగుణంగా వాలిడ్ పబ్లిక్ షార్ట్స్ వ్యూస్ స్థానంలో క్వాలిఫైడ్ షార్ట్స్ న్యూస్, వాలిడ్ పబ్లిక్ వాచ్ అవర్స్ స్థానంలో క్వాలిఫైడ్ వాచ్ అవర్స్ అనే పేర్లతో మార్చనుంది.
యూజర్లకు బెనిఫిట్ ఏంటి?
యూజర్లకు ఎలాంటి బెనిఫిట్ ఉండదు. ఇదంతా బ్యాక్ గ్రౌండ్ జరుగుతుంది.. యూట్యూబ్ కొత్త వ్యూ ఫీచర్ తీసుకురాలేదు.. వ్యూ కౌంటింగ్ లెక్కించే విధానాన్ని మార్పులు చేస్తుంది అంతే.. ఎంతమంది వీడియో చూస్తున్నారో దానిపైనే వ్యూ కౌంట్ ఆధారపడి ఉంటుంది. ఎక్కువ వ్యూ కౌంట్ పెరిగితే హై ఎంగేజ్ మెంట్ అని కాదు.. వీడియో కంటెంట్ చూసేవాళ్లు నిజంగా చూస్తున్నారా? లేదో ప్లాట్ ఫారం రికార్డు చేసేందుకు ఎంగేజ్డ్ వ్యూస్ కౌంట్ చేస్తుంది.
