Youtube Gifts : యూట్యూబ్ ‘గిఫ్ట్స్’ ఫీచర్ వచ్చేసింది.. ఇక లైవ్ స్ట్రీమ్ చేస్తే చాలు.. ఫ్యాన్స్ నుంచి డైరెక్ట్‌గా డబ్బు!
Youtube Gifts : యూట్యూబ్ గిఫ్ట్స్ ఫీచర్ అదుర్స్.. ఇక క్రియేటర్లకు ఫ్యాన్స్ నుంచే డబ్బులు వస్తాయి.. జస్ట్ గిఫ్ట్స్ పంపితే చాలు.. అవే డబ్బులుగా మారి నేరుగా క్రియేటర్ల ఖాతాల్లో పడతాయి.
- Sreehari A
- Published on- July 9, 2026 / 04:40 PM IST
Youtube Gifts
- యూట్యూబ్‌లో కొత్త గిఫ్ట్స్ ఫీచర్.. లైవ్‌తోనే డబ్బుల వర్షం
- యూట్యూబ్ క్రియేటర్లకు కొత్త ఆదాయ మార్గం
- లైవ్‌లో గిఫ్ట్స్.. యూట్యూబ్ క్రియేటర్లకు బంపర్ ఛాన్స్
- ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు.. ఎర్నింగ్స్ కూడా
Youtube Gifts : యూట్యూబ్ క్రియేటర్లకు పండగే.. భారతీయ యూట్యూబ్ లైవ్‌స్ట్రీమింగ్ క్రియేటర్ల కోసం కొత్త ‘గిఫ్ట్స్’ ఫీచర్ వచ్చేసింది. ఈ ఫీచర్ ద్వారా వీక్షకులు లైవ్‌స్ట్రీమ్‌ల సమయంలో తమకు ఇష్టమైన క్రియేటర్లకు యానిమేటెడ్ గిఫ్ట్స్ పంపవచ్చు. అందులో వడా పావ్, చాయ్-టోస్ట్, పానీ పూరీ వంటి భారతీయ స్టయిల్ జనరేటెడ్ డిజైన్లు ఉంటాయి. క్రియేటర్లు తమ ఫాలోవర్లతో ఈజీగా కనెక్ట్ అవ్వొచ్చు. అలాగే వెర్టికల్ లైవ్‌స్ట్రీమ్‌ల ద్వారా కొత్త ఆదాయాన్ని కూడా సంపాదించుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
గిఫ్ట్స్, జ్యువెల్స్ ఏంటి? :
యూట్యూబ్ గిఫ్ట్స్ ఫీచర్ అనేది యానిమేటెడ్ వర్చువల్ గిఫ్ట్స్ మాత్రమే. వీటిని వీక్షకులు లైవ్ స్ట్రీమ్‌ల సమయంలో తమకు ఇష్టమైన క్రియేటర్లకు పంపవచ్చు. ఈ గిఫ్ట్స్ ద్వారా వీక్షకులు తమ రియాక్షన్లతో గిఫ్ట్ పంపిన వెంటనే యానిమేషన్ లైవ్ స్ట్రీమ్‌లో కనిపిస్తుంది.
ఈ గిఫ్ట్స్ పంపాలంటే వీక్షకులు ముందుగా జ్యువెల్స్‌ను కొనాలి. జ్యువెల్స్ ద్వారా అర్హత పొందిన వర్టికల్ లైవ్ స్ట్రీమ్‌ల సమయంలో క్రియేటర్లకు వివిధ యానిమేటెడ్ గిఫ్ట్స్ పంపవచ్చు. లైవ్ స్ట్రీమ్ ఎక్స్ పీరియన్స్ ద్వారా క్రియేటర్లు డబ్బు సంపాదించుకోవచ్చు.
Read Also : Vivo X100 Pro Price : వావ్.. ఏంది భయ్యా ఆఫర్.. ఈ వివో ప్రో ఫోన్ మరి ఇంత తక్కువా.. అమెజాన్‌లో జస్ట్..!
వ్యూయర్స్ జ్యువెల్స్ ద్వారా క్రియేటర్‌కు గిఫ్ట్స్ పంపాలి. ఆ తర్వాత క్రియేటర్ రూబీలను అందుకుంటారు. గిఫ్ట్స్ ద్వారా సంపాదించిన మొత్తం రూబీలుగా మారుతాయి. ఇందులో వడా పావ్, చాయ్-టోస్ట్, పానీ పూరీ, బధాయి హో, కేమ్ చో, మచ్చా, ఆల్ ఈజ్ వెల్ వంటి యానిమేటెడ్ గిఫ్ట్స్ ఉన్నాయి.
వ్యూయర్లు తమకు ఇష్టమైన క్రియేటర్లకు సపోర్టు చేసేందుకు ఈ గిఫ్ట్స్ పంపవచ్చు. భవిష్యత్తులో పండుగలు, ప్రత్యేక సందర్భాల కోసం కొత్త సీజనల్ వర్చువల్ గిఫ్ట్స్ కూడా ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
గిఫ్ట్స్ ఫీచర్ ఎనేబుల్ ఎలా? :
ఈ ఫీచర్‌కు అర్హత ఉన్న ఛానెల్ క్రియేటర్లు, యూట్యూబ్ స్టూడియోలోని ‘Earn’ సెక్షన్‌కు వెళ్లడం ద్వారా ‘Gifts’ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వర్చువల్ ఐటమ్స్ మాడ్యూల్ నిబంధనలను అంగీకరించాలి. ఈ ఫీచర్ ఎనేబుల్ అయ్యాక వర్టికల్ లైవ్ స్ట్రీమ్‌లలో ‘Gifts’ ఆప్షన్ ఆటోమేటిక్‌గా కనిపిస్తుంది.
అయితే, వర్టికల్ లైవ్ స్ట్రీమ్‌లలో ‘Gifts’ ఫీచర్‌ను ఎనేబుల్ చేసిన క్రియేటర్లకు వారి స్ట్రీమ్‌లలో ‘Super Stickers’ అందుబాటులో ఉండవు. భారత్‌లో క్రియేటర్ ఎకానమీ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో యూట్యూబ్ ఈ ఫీచర్‌ను ప్రారంభించింది. కంపెనీ ప్రకారం, సంవత్సరానికి రూ. 7 లక్షలు లేదా ఆపై సంపాదించే భారతీయ యూట్యూబ్ ఛానెళ్ల సంఖ్య 20 శాతానికి పైగా పెరిగింది.
