ఇన్సూరెన్స్ డబ్బుల కోసం 10మంది హత్య
- bheemraj
- Published On : March 3, 2021 / 09:58 PM IST
10 killed for insurance money : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఇన్సూరెన్స్ మాఫియా అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 10 మందిని ఇన్సూరెన్స్ డబ్బు కోసం హత్య చేసిన ముఠా మరికొంత మందిని టార్గెట్ చేసింది. అయితే తన బ్యాంక్ ఖాతా నుంచి అమౌంట్ తగ్గడంతో ఆరా తీసిన భాస్కర్ అనే యువకుడికి అసలు విషయం తెలిసింది.
తనకు సంబంధం లేకుండా తన పేరుపై 10 పాలసీలు ఉండడం చూసి విస్తుపోయాడు. ఘటనపై బాధితుడు భాస్కర్ పోలీసులను ఆశ్రయించాడు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన బ్యాంక్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
