Telangana State : 24 గంటల్లో 1,492 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. గతంలో భారీగా నమోదైన కేసులు..తక్కువ సంఖ్యలో నమోదవుతుండడంతో ప్రజలు ఊపరిపీల్చుకుంటున్నారు. తాజాగా..24 గంటల్లో 1,492 కరోనా కేసులు వెలుగు చూశాయి.
- madhu
- Published On : June 17, 2021 / 07:09 PM IST
Tg Covid 19
COVID-19 Cases : తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. గతంలో భారీగా నమోదైన కేసులు..తక్కువ సంఖ్యలో నమోదవుతుండడంతో ప్రజలు ఊపరిపీల్చుకుంటున్నారు.
తాజాగా..24 గంటల్లో 1,492 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్కరోజులో 13 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 19 వేల 521 యాక్టివ్ కేసులున్నాయి. 3 వేల 534 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో 166 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 5 లక్షల 86 వేల 362గా ఉంది. గృహ/సంస్థల ఐసోలేషన్ గల వ్యక్తుల సంఖ్య 19 వేల 521 గా ఉంది.
ఏ జిల్లాలో ఎన్ని కేసులు : –
ఆదిలాబాద్ 03. భద్రాద్రి కొత్తగూడెం 91. జీహెచ్ఎంసీ 166. జగిత్యాల 26. జనగామ 14. జయశంకర్ భూపాలపల్లి 25. జోగులాంబ గద్వాల 15. కామారెడ్డి 06. కరీంనగర్ 92. ఖమ్మం 129. కొమరం భీం ఆసిఫాబాద్ 01. మహబూబ్ నగర్ 29.
మహబూబాబాద్ 67. మంచిర్యాల 49. మెదక్ 13. మేడ్చల్ మల్కాజ్ గిరి 83. ములుగు 31. నాగర్ కర్నూలు 16. నల్గొండ 115. నారాయణపేట 09. నిర్మల్ 07. నిజామాబాద్ 08. పెద్దపల్లి 59. రాజన్న సిరిసిల్ల 28. రంగారెడ్డి 92. సంగారెడ్డి 18. సిద్దిపేట 53. సూర్యాపేట 89. వికారాబాద్ 19. వనపర్తి 27. వరంగల్ రూరల్ 20. వరంగల్ అర్బన్ 65. యాదాద్రి భువనగిరి 27. మొత్తం 1,492
