తెలంగాణలో కొత్తగా 301 కరోనా కేసులు, ఇద్దరు మృతి
- bheemraj
- Published On : January 12, 2021 / 01:52 PM IST
301 new corona cases registered in Telangana: తెలంగాణలో కొత్తగా 301 కరోనా కేసులు నమెదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,90,309 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో 4,524 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
ఇప్పటి వరకు కరోనా నుంచి 2,84,217 మంది కోలుకోగా, నిన్న 293 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య 1,568 మందికి చేరింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 2,459 మంది ఉన్నారు. కొత్తగా జీహెచ్ఎంసీ పరిధిలో 58 కేసులు నమోదు అయ్యాయి.
