IPS Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

తెలంగాణలో భారీ సంఖ్యలో ఐపీఎస్ ఉన్నతాధికారులను(IPS Transfers) బదిలీ చేస్తూ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

36 IPS officers Transfers in Telangana State DGP CV Anand issued an official order

  • భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు
  • 36 మందికి స్థానచలనం కల్పిస్తూ
  • డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు

IPS Transfers: తెలంగాణలో భారీ సంఖ్యలో ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 36 మంది ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలలో భాగంగా హైదరాబాద్ జాయింట్ కమిషనర్‌గా ఉన్న డి.జోయల్ డేవిస్‌ను ఐదో జోన్, యాదాద్రి డీఐజీగా నియమించారు. రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా జోన్ 1 డీఐజీగా, వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా బదిలీ అయ్యారు. హైదరాబాద్ ఉత్తర జాయింట్ సీపీగా ఉన్న శ్వేతా రెడ్డిని వరంగల్ కొత్త సీపీగా నియమించారు.

Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు పలు బ్యాంకులకు నోటీసులు

మరికొన్ని కీలక నియామకాల్లో.. సీఐడీ ఎస్పీగా రూపేణ్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్లుగా చంద్రమోహన్ మరియు సాయి మనోహర్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఇక్బాల్, హైడ్రా అదనపు కమిషనర్‌గా ఆనంద్ కుమార్, గోల్కొండ జోన్ డీసీపీగా రాఘవేంద్ర రెడ్డి, సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ(IPS Transfers)గా వై.సాయి శేఖర్ నియమితులయ్యారు. అలాగే ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న సీహెచ్‌.సింధు శర్మను సీఐ సెల్, ఇంటెలిజెన్స్ ఎస్పీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.