Gachibowli Tragedy: గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఏడంతస్తుల భవనం.. ఇద్దరు మృతి
హైదరాబాద్ ఐటీ కారిడార్ లోని గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో శనివారం తీవ్ర విషాదం(Gachibowli Tragedy) చోటుచేసుకుంది.
- V Santhosh Kumar
- Published on- August 22, 2026 / 03:10 PM IST
7 storey building collapses in gachibowli anjaiah nagar hyderabad two dead
- గచ్చిబౌలిలో కూలిన ఏడంతస్తుల భవనం
- శిథిలాల కింద చిక్కుకుని ఇద్దరు మృతి
- ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్
Gachibowli Tragedy: హైదరాబాద్ ఐటీ కారిడార్ లోని గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నాలాను ఆనుకుని కేవలం 50 గజాల చిన్న స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఇటీవలే నిర్మాణం పూర్తయి అద్దెకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఈ భవనం అకస్మాత్తుగా పక్కకు వాలిపోవడంతో అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందారు. భవనం కూలిన శబ్దానికి సమీపంలోని హాస్టల్ విద్యార్థులు, వైట్ ఫీల్డ్ అపార్ట్‌మెంట్ వాసులు ప్రాణభయంతో రోడ్లపైకి పరుగులు తీశారు.
Zaheerabad Tragedy: రూ.500 కోసం కన్నతండ్రినే హత్య.. గొంతు కోసి దారుణంగా.. జహీరాబాద్‌లో ఘోరం
ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్.. కేసు నమోదు చేసిన అధికారులు:
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, GHMC, HYDRAA రెస్క్యూ బృందాలు ఘటనా (Gachibowli Tragedy)స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. భారీ క్రేన్ల సహాయంతో శిథిలాలను తొలగించి రెండు మృతదేహాలను వెలికితీశారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రమాదకరంగా నిర్మాణం చేపట్టిన భవన యజమానిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
