9వ తరగతి అబ్బాయిని ప్రేమించిన ఇంటర్ యువతి.. కట్ చేస్తే, బిడ్డకు జననం.. షాకిచ్చిన బాలుడి తల్లిదండ్రులు
Wanaparthy District : తొమ్మిదో తరగతి చదువుతున్న అబ్బాయి.. ఇంటర్ చదువుతున్న యువతి ప్రేమించుకున్నారు
- Harishth Thanniru
- Published On : November 30, 2025 / 11:43 AM IST
9th Boy Inter Girl love
9th Boy Inter Girl love : తొమ్మిదో తరగతి చదువుతున్న అబ్బాయి.. ఇంటర్ చదువుతున్న యువతి ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో యువతి గర్భందాల్చింది, తాజాగా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. తన బిడ్డకు తండ్రి తొమ్మిదో తరగతి చదివే బాలుడేనని యువతి చెబుతుంది. అయితే, బాలుడి తల్లిదండ్రులు మాత్రం షాకిచ్చారు. తమ అబ్బాయికి ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని తెగేసి చెప్పారు. దీంతో ఈ కేసు పోలీస్ స్టేషన్ వరకు చేరింది.. బాలిక కుటుంబ సభ్యులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
వనపర్తి జిల్లాలో జరిగిన ఒక అత్యంత దారుణమైన ఘటన సమాజాన్ని కలవరపరుస్తోంది. చిన్న వయస్సులో ప్రేమ మోజులో యువత చెడుదారులు పడుతున్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక, బాలుడు కొన్నిరోజులుగా ప్రేమించుకుంటున్నారు. బాలుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. బాలిక ఇంటర్ చదువుతుంది. వీరిద్దరూ ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో శారీరకంగా దగ్గరయ్యారు. దీంతో బాలిక గర్భవతి అయింది. విషయం ఇంట్లో తెలియడంతో గ్రామంలో పంచాయితీ నిర్వహించగా.. బాలుడు తనకేమీ తెలియదని చెప్పాడు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు వన పర్తి రూరల్ పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు.
Also Read: TGSRTC : తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం.. ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకనుంచి 60రోజులు ముందుగానే..
ఇదిలా ఉండగా.. బాలిక ఈ నెల 14న ఓ చిన్నా రికి జన్మనిచ్చింది. అయినా బాలుడు గానీ, అతడి కుటుంబ సభ్యులు గానీ ఎవరూ రాకపోవడం, తమకు సంబంధం లేదని చెబుతుండడంతో బాలిక తల్లిదండ్రులు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. డీఎన్ఏ టెస్ట్ చేయించి తమకు న్యాయం చేయాలని బాలిక కుటుంబసభ్యులు కోరారు.
పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ ఇద్దరూ మైనర్లే కావడం, కేసు పోక్సో చట్టం పరిధిలోకి వచ్చే అవకాశం ఉండటంతో చర్యలు తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు. ఈ ఘటన ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. పిల్లలు ఈ విధంగా పెడదోవ పట్టడానికి ప్రధాన కారణం తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపమే అని చెప్పవచ్చు.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో.. తల్లిదండ్రులు ఆర్థిక అవసరాల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఫలితంగా.. పిల్లలతో గడిపే సమయం తగ్గి, వారిపై శ్రద్ధ, నియంత్రణ కోల్పోతున్నారు. యుక్తవయస్సు మార్పుల గురించి, లైంగిక విద్య గురించి వారికి సరైన అవగాహన అందించడంలో కుటుంబ వ్యవస్థ విఫలమవుతోందని పలువురు పేర్కొంటున్నారు.
