KTR – ACB Court: విచారణకు రండి.. ఆ కేసులో కేటీఆర్ కు ఏసీబీ కోర్టు నోటీసులు
ఈ కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా అరవింద్ కుమార్, ఏ3గా బీఎల్ఎన్ రెడ్డి, ఏ4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లీశ్వరరావు, ఏ5గా FEO సంస్థను చేర్చారు.
- Naveen
- Updated on- May 14, 2026 / 11:49 PM IST
KTR – ACB Court: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ కోర్టు నోటీసులు పంపింది. కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డికి కోర్టు సమన్లు జారీ చేసింది. జూలై 31న విచారణకు రావాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఏసీబీ అధికారులు దాఖలు చేసిన చార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా అరవింద్ కుమార్, ఏ3గా బీఎల్ఎన్ రెడ్డి, ఏ4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లీశ్వరరావు, ఏ5గా FEO సంస్థను చేర్చారు.
2023లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేస్ ఈవెంట్ కోసం విదేశీ సంస్థకు అక్రమంగా డబ్బులు చెల్లించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో కేసు నమోదు చేసిన ఏసీబీ కేటీఆర్ ను ఒకసారి విచారించింది. ఇక, ఈ కార్ రేస్ కేసుకి సంబంధించి ఏసీబీ ఫైనల్ చార్జిషీట్ ను దాఖలు చేసింది. హెచ్ఎండీఏ ఖాతా నుంచి సుమారుగా 55 కోట్ల రూపాయలను ఎఫ్ఈవో సంస్థకు బదిలీ చేసినట్లుగా ఏసీబీ గుర్తించింది. అందుకు సంబంధించిన కీలక వివరాలను అభియోపత్రాలలో పేర్కొంది.
Also Read: ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పరీక్షల విధానంలో భారీ మార్పులు, కొత్త గ్రూప్ ప్రారంభం..
