ACB Raids : జలమండలిలో భారీ అవినీతి తిమింగలం.. రూ.100 కోట్ల ఆస్తులు.. కిలోన్నర బంగారం.. రూ.కోటి నగదు..!

ACB Raids : హైదరాబాద్ జలమండలిలో భారీ అవినీతి తిమింగలం పట్టుబడింది. సుమారు రూ.100 కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు.

acb raids in hyderabad water board gm house seize more than rs 100 cr value assets cash gold

ACB Raids : తెలంగాణ అతిపెద్ద అవినీతి తిమింగలం పట్టుబడింది. జలమండలి మేనేజర్ అనంత లక్ష్మి కుమార్ నివాసంలో తాజాగా జరిగిన ఏసీబీ సోదాల్లో రూ.100 కోట్ల విలువైన ఆస్తులతో పాటు కేజీ బంగారం, కోటి రూపాయల నగదు పట్టుబడింది. ఈ క్రమంలో అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కుమార్ ని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ రెడ్ హిల్స్ జలమండలి జనరల్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కుమార్ నివాసంలో కుప్పలు తెప్పలుగా అవినీతి సొత్తు వెలుగుచూసింది.

కుమార్ వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయంటూ ఫిర్యాదు రావడంతో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం.. హైదరాబాద్‌లోని కుమార్ నివాసంతో పాటు మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. మల్లాపూర్‌లోని కుమార్ ఇంట్లో ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. జీఎం కుమార్ బంధువుల ఇళ్లలోనూ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన సోదాల్లో అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు.

* సీఎం విజయ్‌కి కారు నెంబర్ ప్లేట్ గిఫ్ట్ ఇచ్చిన డైరెక్టర్.. అప్పుడు అనుకున్నారు ఇప్పుడు అయింది..

కుప్పలుగా ఉన్న నోట్ల కట్టలు చూసి ఏసీబీ అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. నగదు లెక్కించడం కోసం కౌంటింగ్ మెషిన్లు వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు స్వాధీనం చేసిన నగదు, ఆస్తుల వివరాలపై ఆరా తీస్తున్న దర్యాప్తు బృందం సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది..

ఇప్పటివరకు జరిగిన సోదాల్లో అధికారులు సుమారు 100 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. మల్లాపూర్‌లోని కుమార్ నివాసంతో పాటు బంధువుల నివాసాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు జరిపిన సోదాల్లో పట్టుబడిన నగదు వివరాలు ఇలా ఉన్నాయి.

  • ఇంట్లో కోటి 10 లక్షల నగదు.. (1.1 Cr )
  • సుమారు 1 KG బంగారు ఆభరణాలు…
  • హైదరాబాద్ లో గేటెడ్ కమ్యూనిటి లలో 3 ఫ్లాట్స్.. 6 ఓపెన్ ఫ్లాట్స్.
  • నిజామాబాద్ లో 3 ఎకరాల భూమి..ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ..
  • మరికొన్ని ప్రాంతాల్లో భారీగా ఆస్తులు గుర్తించిన ఏసీబీ..

ఏసీబీ అధికారులు కుమార్ బ్యాంకు లాకర్లు తెరవనున్నారు. ఇవి తెరిస్తే అక్రమాస్తుల చిట్టా మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.