తెలంగాణ సోలార్ ప్రాజెక్ట్ అదానీ చేతుల్లోకి!
- vamsi
- Updated on- March 21, 2021 / 08:12 AM IST
Adani Green Buys 50 Mw Solar Project
తెలంగాణలోని 50 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును అదానీ గ్రూప్ అనుబంధ సంస్థ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్) దక్కించుకుంది. కెనడాకు చెందిన స్కైపవర్ గ్లోబల్‌తో ఈ మేరకు ఒప్పందం చేసుకున్నట్లు ఏజీఈఎల్ వెల్లడించింది. తెలంగాణలో 50 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును ఓ స్పెషల్ పర్పస్ వెహికిల్(NPV) ద్వారా టోరంటో కేంద్రంగా నడుస్తున్న స్కైపవర్ గ్లోబల్ నిర్వహిస్తోంది.
2017వ సంవత్సరంలో అక్టోబర్ నెలలో ఇది ఏర్పాటు కాగా.. తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీతో దీర్ఘకాల విద్యుత్తు కొనుగోలు ఒప్పందం చేసుకున్నది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ ప్రాజెక్టును అదానీ గ్రూప్ దక్కించుకుంటున్నది. కాగా, ఈ ప్రాజెక్టుతో తమ రెన్యువబుల్ ఎనర్జీ విభాగం మరింత బలోపేతం అయ్యిందని ఏజీఈఎల్ ప్రకటనలో తెలిపింది.
2025 నాటికి 25 గిగావాట్ల ఉత్పాదక సామర్థ్యాన్ని చేరుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం సంస్థ 14.86 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తుంది.
