Balkampet Yellamma Kalyanam: నేడే ‘బల్కంపేట ఎల్లమ్మ’ కళ్యాణం.. భారీ ఏర్పాట్లు, ట్రాఫిక్ మళ్లింపులు.. ఈ రూట్లో అస్సలు వెళ్ళకండి

హైదరాబాద్‌లోని ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానంలో ఇవాళ అమ్మవారి కళ్యానోత్సవం(Balkampet Yellamma Kalyanam) కన్నులపండుగగా జరుగనుంది.

Balkampet Yellamma Kalyana Mahotsavam to be celebrated grandly today.

  • బల్కంపేట ఎల్లమ్మ మహోత్సవం ప్రారంభం
  • నేడే అమ్మవారి వైభవ కల్యాణం
  • రెండు రోజులు ట్రాఫిక్ మళ్లింపు

Balkampet Yellamma Kalyanam
: హైదరాబాద్‌లోని ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానంలో అమ్మవారి వార్షిక కల్యాణోత్సవాలు కనులపండువగా ప్రారంభమయ్యాయి. సోమవారం అమ్మవారి ఎదుర్కోలు వేడుక అత్యంత వైభవంగా జరగగా, మంగళవారం ప్రధాన ఘట్టమైన ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవం(Balkampet Yellamma Kalyanam), బుధవారం సాయంత్రం రథోత్సవం నిర్వహించనున్నారు. ప్రభుత్వం తరఫున జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

Ethanol Atms: ఇక ఎల్పీజీ గ్యాస్‌కు గుడ్‌బై.. త్వరలో ఇథనాల్ ఏటీఎంలు.. మార్కెట్లోకి కొత్త ఇథనాల్ స్టవ్‌లు

8 లక్షల మంది భక్తులు:

ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి దాదాపు 8 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం భారీ షెడ్లు, క్యూలైన్లు, నిరంతర విద్యుత్, తాగునీటి సరఫరా, ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. మంగళవారం కల్యాణం అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి మహా అన్నదానం జరగనుంది. అలాగే, సీసీ కెమెరాల పర్యవేక్షణలో భారీ పోలీస్ బందోబస్తును కూడా సిద్ధం చేశారు.

ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ స్థలాలు:

భారీ జనసందోహం దృష్ట్యా బల్కంపేట పరిసర ప్రాంతాల్లో రెండు రోజుల పాటు ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. ఎస్ఆర్ నగర్ టీ జంక్షన్, ఫతేనగర్ ఫ్లైఓవర్, బేగంపేట వైపు నుంచి వచ్చే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించారు. భక్తుల వాహనాల కోసం ఆర్అండ్ బి ఆఫీస్, జీహెచ్ఎంసీ గ్రౌండ్, ఫతేనగర్ అండర్ బ్రిడ్జి, నేచర్ క్యూర్ హాస్పిటల్ వంటి ప్రాంతాల్లో పార్కింగ్ వసతి కల్పించారు. అత్యవసర ప్రయాణ సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626 ను అందుబాటులో ఉంచారు.