Bandi Sanjay Kumar: దేశంలో మామిడికాయ తినాలన్నా భయమే.. బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్

కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో కిసాన్‌మోర్చా నిర్వహించిన రైతు సమ్మేళన సదస్సులో బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Bandi Sanjay Kumar makes interesting comments on organic farming.

  • మామిడికాయ తినాలంటే భయపడుతున్న ప్రజలు
  • ప్రకృతి వ్యవసాయానికి కేంద్రం ప్రోత్సాహం
  • రైతులను సేంద్రీయ సాగువైపు మళ్లింపు

Bandi Sanjay Kumar: దేశంలో ఆహార భద్రత, ప్రజల ఆరోగ్యం, రైతుల భవిష్యత్తు వంటి అంశాలపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో కిసాన్‌మోర్చా నిర్వహించిన రైతు సమ్మేళన సదస్సులో ఆయన మాట్లాడుతూ, దేశంలో మామిడికాయ తినాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది, నాకు బీపీ, షుగర్ ఏమీ లేవు కానీ హైదరాబాద్‌లో పాలు తాగి 3 రోజులు ఆసుపత్రి పాలయ్యా. అంతా రసాయనాల మాయం అయిపోయింది. వ్యవసాయంలో రసాయనాల అధిక వినియోగం ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నేటి పరిస్థితుల్లో సహజసిద్ధమైన ఆహార ఉత్పత్తులపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోందని, ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్రకృతి వ్యవసాయం కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.

Telangana Rains: తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్.. మరికొన్ని గంటల్లో భారీ వర్షాలు

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. ఈ రంగ అభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్‌లో వేల కోట్ల రూపాయలు కేటాయించబడినట్లు ఆయన వెల్లడించారు. ప్రారంభ దశలో రైతులకు ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోయినా, కొంతకాలం తర్వాత మంచి ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. సేంద్రీయ పద్ధతుల్లో పండించిన ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

అలాగే, ఎరువుల కోసం విదేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితిని తగ్గించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. రాబోయే కాలంలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో వేలాది మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించే లక్ష్యంతో పనిచేస్తామని వెల్లడించారు. సహజ వ్యవసాయ పద్ధతుల్లో పండించిన పంటలకు తగిన గుర్తింపు, మార్కెట్ అవకాశాలు, మద్దతు ధరలు లభించేలా కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.