Azharuddin : హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌కు బిగ్ షాక్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ)లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఏకంగా హెచ్ సీఏ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్ పైనే
- Naveen
- Published On : June 16, 2021 / 10:49 PM IST
Big Shock For Azharuddin
Azharuddin : Azharuddin : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ)లో ఆధిపత్య పోరు కొత్త మలుపు తిరిగింది. సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఏకంగా హెచ్ సీఏ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్ పైనే వేటు పడింది. టీమిండియా మాజీ కెప్టెన్ అజార్ పై అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయన్న కారణంతో అపెక్స్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. హెచ్ సీఏలో అజర్ సభ్యత్వాన్ని కూడా కౌన్సిల్ రద్దు చేసింది.
అజ్జూ హెచ్ సీఏ అధ్యక్ష పదవిలోకి వచ్చినప్పటి నుంచే విభేదాలు భగ్గుమన్నాయి. ఏప్రిల్ లో జరిగిన జనరల్ బాడీ మీటింగ్ అందుకు వేదికగా నిలిచింది. అజర్, హెచ్ సీఏ కార్యదర్శి విజయానంద్ స్టేజిపైనే గొడవపడ్డారు. ఈ నేపథ్యంలోనే వేటు పడినట్టు అర్థమవుతోంది. తాజాగా అజర్ కు అపెక్స్ కౌన్సిల్ షోకాజ్ నోటీసులు పంపింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నందుకే వేటు వేసినట్టు స్పష్టం చేసింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉండటం, హెచ్‌సీఏ రూల్స్‌కి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం వంటి ఆరోపణలు ఉన్నాయి.
