Padi Kaushik Reddy: కౌశిక్ రెడ్డిపై దాడికి యత్నం.. కరీంనగర్ లో టెన్షన్ టెన్షన్.. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్..

BJP Attacks Padi Kaushik Reddy: తనపై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదన్నారు.

  • Updated on- May 8, 2026 / 10:20 AM IST

Bjp Supporters Try To Attack Mla Padi Kaushik Reddy In Karimnagar

Padi Kaushik Reddy: కరీంనగర్ పట్టణంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై బీజేపీ శ్రేణులు దాడికి దిగాయి. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కూడా దాడికి బీజేపీ శ్రేణులు యత్నించారు. కౌశిక్ రెడ్డి కారు, ఆఫీస్ అద్దాలను ధ్వంసం చేశారు. కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ ముగిసిన కాసేపటికే బీజేపీ శ్రేణులు గంగుల క్యాంప్ కార్యాలయంలోకి దూసుకెళ్లాయి. కౌశిక్ రెడ్డి కారుతో పాటు గంగుల ఆఫీస్ లోని ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్ పై కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ తంబాకుతో డ్రగ్స్ కలిపి తీసుకుంటారని, అందువల్లే తలపై వెంట్రుకలు ఊడిపోయాయని అన్నారు. కేటీఆర్ డ్రగ్స్ టెస్ట్ కు సిద్ధంగా ఉన్నారని, సంజయ్ కూడా టెస్టులకు రావాలని సవాల్ విసిరారు. ఈ సమయంలో పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న బీజేపీ కార్యకర్తలు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా దాడికి పాల్పడ్డారు. దాడి అనంతరం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తనపై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదన్నారు. కేటీఆర్ పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తాను కౌంటార్ మాత్రమే ఇచ్చానని వివరణ ఇచచారు. తనపై రౌడీషీటర్లతో దాడి చేయించారని ఆరోపించారు.

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అక్కడికి వచ్చిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి.

Also Read: ఇక సమరమే.. నెక్స్ట్ ఎలక్షన్సే టార్గెట్‌..! పార్టీ బలోపేతంపై కేటీఆర్ ఫోకస్..