KCR : పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై కేసీఆర్ ఆరా.. కేటీఆర్‌కు కీలక ఆదేశాలు

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై పార్టీ అధినేత కేసీఆర్ (KCR) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.

BRS chief KCR inquires about peddi sudarshan reddy health

KCR : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై పార్టీ అధినేత కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. సుదర్శన్ రెడ్డికి హైదరాబాద్‌లో అత్యుత్తమ వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

సుదర్శన్ రెడ్డి అస్వస్థత విషయం తెలిసిన వెంటనే స్పందించిన కేసీఆర్.. ఉదయం నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం తెలుసుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో పాటు కేటీఆర్, హరీష్ రావు, వినోద్ కుమార్, జిల్లా నేతలతో మాట్లాడుతూ చికిత్సకు సంబంధించిన ఏర్పాట్లపై సూచనలు చేస్తున్నారు.

Peddi Sudarshan Reddy : గ్రీన్ ఛానల్ ద్వారా యశోద ఆస్పత్రికి పెద్ది సుదర్శన్ రెడ్డి.. మెరుగైన చికిత్స అందిస్తున్న వైద్యులు

సుదర్శన్ రెడ్డికి అత్యుత్తమ వైద్యం అందేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పార్టీ ముఖ్య నేతలను కేసీఆర్ అప్రమత్తం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వైద్యులు కూడా సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న చికిత్స వివరాలను ఎప్పటికప్పుడు కేసీఆర్‌కు తెలియజేస్తున్నట్లు సమాచారం.

కాగా.. సుదర్శన్ రెడ్డికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పార్టీ నాయకత్వం సమన్వయంతో పనిచేస్తుండగా, ఆయన త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు.