KTR: సుందరీకరణ పేరుతో ఇళ్లు కూల్చొద్దు, రెండేళ్లు మీ ఆస్తులు కాపాడుకోండి- కేటీఆర్

ఒక్క ఇల్లు కూడా కూలగొట్టకుండా తాము ప్రణాళిక రూపొందిస్తే 3వేలకు పైగా ఎకరాలను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

  • Published On : March 15, 2026 / 01:08 AM IST

 

KTR: మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని మాజీ మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం హిమాయత్ సాగర్ లో మూసీ రివర్ డెవలప్ మెంట్ పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ వర్సెస్ పబ్లిక్ పాయింట్ నిర్వహించారు కేటీఆర్. ఇందులో బాధితులు పాల్గొన్నారు. బాధితులు ఒక్కొక్కరు తమ ఆవేదనను తెలియజేశారు.

మూసీ సుందరీకరణ పేరుతో పరీవాహక ప్రాంతంలోని ఇళ్లను కూల్చుతామంటే ఊరుకునేది లేదని కేటీఆర్ హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో మూసీ పునరుజ్జీవం కోసం చేపట్టిన పలు అభివృద్ది పనులను ఆయన ప్రస్తావించారు. అన్నింటిని పీపీటీలో వివరించారు. ప్రభుత్వం దగ్గర నమూనాలు ఉన్నా కొత్తగా డిజైన్స్ వేయించారని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటివరకు డీపీఆర్ సిద్ధం చేయలేదన్నారు.

కానీ చాలా చోట్ల ఇళ్లకు రెడ్ మార్కింగ్ వేశారని కేటీఆర్ ఆరోపించారు. ఒక్క ఇల్లు కూడా కూలగొట్టకుండా తాము ప్రణాళిక రూపొందిస్తే 3వేలకు పైగా ఎకరాలను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెనక్కి తగ్గాలని, లేదంటే పోరుబాట తప్పదని కేటీఆర్ హెచ్చరించారు.

మూసీ పరీవాహక ప్రాంత బాధితులు ఐక్యంగా ఉండాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. రెండేళ్లు మీ ఇళ్లను కాపాడుకోండి, ఆ తర్వాత మా ప్రభుత్వం వస్తుందని చెప్పారు. అప్పుడు ఇంటికి ఉన్న సున్నం కూడా ముట్టుకోనివ్వమని చెప్పారు కేటీఆర్.