గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగులపై విరిగిపడ్డ ఫ్యాన్
- nagamani
- Published on- June 3, 2020 / 06:18 AM IST
కరోనా వచ్చి హాస్పిటల్ లో జాయిన్ అయిన బాధితులకు చావు తప్పి కన్ను లొట్టపోయింది అన్నట్లుగా మారింది. ముషీరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ లో సీలింగ్ ఫ్యాన్ హఠాత్తుగా ఊడి బెడ్‌పై చికిత్స పొందుతున్న కరోనా రోగులపై పడింది. ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. కానీ ప్రమాదం ఏమీ జరకపోవటంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా అయ్యిందిరా బాబూ అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు.
నగరంలో కరోనా రోగుల జాబితా రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో గాంధీఆస్పత్రి చేరిన కరోనా బాధితులు ఏడో అంతస్తులో చికిత్స పొందుతున్నారు. మంగళవారం (జూన్ 3,2020) ఉదయం రోజులాగానే రోగులు బెడ్ పై పడుకుని ఉండగా..తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ హఠాత్తుగా ఊడి కిందపడింది.
ఈ ఘటనలో బెడ్‌పై చికిత్స పొందుతున్న ఇరువురు రోగులకు స్వల్ప గాయాలైనట్లుగా సమాచారం. కరోనా పాజిటివ్ రావటంతో బాధితులు ఇప్పటికే మానసికంగా అప్ సెట్ అయి ఉన్నారనీ..ఈ హఠాత్పరిణామంతో మరింత భయాందోళనకు గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు కరోనా బాధితులు. ఇలాంటి ఘటనలు మరోసారి జగరకుండా రోగుల పట్ల బాధ్యతగా ఉండాలని వారు కోరారు.
Read: నిమ్స్ లో నలుగురు డాక్టర్లు, ముగ్గురు సిబ్బందికి కరోనా
