Singareni Collieries : సింగరేణి కార్మికులకు శుభవార్త.. పండుగ వేళ భారీ బోనస్..

Singareni Collieries : సింగరేణి కార్మికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పండుగ వేళ భారీ బోనస్ ప్రకటించింది.

Singareni Collieries

Singareni Collieries : సింగరేణి కార్మికులకు పండుగవేళ తీపికబురు అందింది. దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని ప్రతి సింగరేణి కార్మికుడికి రూ.1,10,250 బోనస్ అందించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విషయాన్ని ట్విటర్ (ఎక్స్) వేదికగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రకటించారు. సింగరేణి అనేది బొగ్గు ఉత్పత్తి సంస్థ మాత్రమే కాదని.. తెలంగాణ రాష్ట్రానికి కొంగు బంగారమన్నారు. లక్షలాది కుటుంబాలకు జీవనాధారమని కొనియాడారు.

Bigg Boss Nominations : నామినేష‌న్స్ హీట్.. ముకేష్ వ‌ర్సెస్ అపూర్వ‌.. మ‌ధ్య‌లో త్రిగుణ్.. ర‌చ్చ రచ్చ‌..

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ ప్రకారం.. దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని ప్రతి సింగరేణి కార్మికుడికి రూ.1,10,250 బోనస్ అందించాలని నిర్ణయించడం జరిగింది. దేశమంతా వెలుగులు విరజిమ్మేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తున్న సింగరేణి కార్మికుల కృషి వెలకట్టలేనిది. సింగరేణి కేవలం బొగ్గు ఉత్పత్తి సంస్థ మాత్రమే కాదు.. తెలంగాణ రాష్ట్రానికి సింగరేణి కొంగు బంగారం. లక్షలాది కుటుంబాలకు జీవనాధారం. దేశాభివృద్ధిలోనూ, తెలంగాణ అభివృద్ధిలోనూ సింగరేణి కీలక భాగస్వామిగా ఉంది. సింగరేణి కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, సింగరేణి భవిష్యత్తుకోసం యాజమాన్యం, కార్మికులు మరింత సమన్వయంతో పనిచేయాలని కోరుతున్నాను. ప్రస్తుత అవసరాలతో పాటు భవిష్యత్ అవకాశాలను దృష్టిలో ఉంచుకుని బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచేలా సింగరేణి ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి. దేశ ప్రగతిలో, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి మరింత కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం సింగరేణికి బకాయిపడిన రూ.60,000 కోట్లను వెంటనే విడుదల చేయాలని కిషన్ రెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు.


తెలంగాణ రాష్ట్రానికి నల్ల బంగారం గనిగా నిలిచే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధిలో అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సంస్థలో వేలాది మంది కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. అయితే, కార్మికులకు దసరా, దీపావళి పండుగల వేళ భారీ బోనస్ ప్రకటించడం పట్ల కార్మిక వర్గాల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.