తెలంగాణలో టెట్ షెడ్యూల్ విడుదల.. 9 రోజుల పాటు పరీక్షలు
టీజీటెట్ పరీక్షలను 2026 జనవరి 3 నుంచి జనవరి 20 వరకు (9 రోజులు) 15 సెషన్లలో నిర్వహిస్తారు.
- T Venkateshwarlu
- Updated on- December 17, 2025 / 08:18 AM IST
TGTET: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) షెడ్యూల్ విడుదలైంది. టీజీటెట్ పరీక్షలను 2026 జనవరి 3 నుంచి జనవరి 20 వరకు (9 రోజులు) 15 సెషన్లలో నిర్వహిస్తారు. ఈ మేరకు మంగళవారం విడుదలైన అధికారిక ప్రెస్ నోట్‌లో పూర్తి వివరాలు వెల్లడించారు.
సర్వీస్‌లో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు కూడా టెట్ తప్పనిసరి. కేజీబీవీల్లో పనిచేసే కాంట్రాక్టు టీచర్లతో కలిపి దాదాపు 70 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల పూర్తిస్థాయి షెడ్యూల్ టెట్ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఈ నెల 27వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
టీజీటెట్ చైర్మన్ తెలిపిన వివరాల ప్రకారం పరీక్ష సమయాలు ఇలా ఉంటాయి.
సెషన్ 1 – ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు.
సెషన్ 2 – మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు.
ఆన్‌లైన్‌లో ఈ పరీక్షలకు నిర్వహిస్తారు. అభ్యర్థులు ముందుగానే హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకుని పెట్టుకోవాలని, పరీక్షా కేంద్రాలకు సరైన సమయానికి చేరుకోవాలని అధికారులు చెప్పారు. ఫిబ్రవరి 10-16 తేదీల మధ్య ఫలితాలను వెల్లడిస్తారు.
