×
Ad

Chicken Price : చికెన్ తింటున్నారా.. మీకు బిగ్ అలర్ట్.. వాతావరణంలో మార్పులే అందుకు కారణం..! కిలో ధర ఎంతో తెలుసా..

Chicken Price : చికెన్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే కిలోపై రూ.50 నుంచి రూ. 100 వరకు పెరిగాయి. రానున్న వారంరోజుల్లో ఈ ధర రూ.400 వరకు చేరుకునే అవకాశం ఉన్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

Chicken Price

  • చికెన్ ధరలకు రెక్కలు
  • ట్రిపుల్ సెంచరీ దాటేసిన కిలో ధర
  • కోళ్లకు సోకుతున్న కొక్కెర తెగులు

Chicken Price : తెలంగాణలో చికెన్ ప్రియులు ఎక్కువే. ఆదివారం వచ్చిందంటే అధికశాతం ఇండ్లు చికెన్ కూరతో గుమగుమలాడుతుంటాయి. ఫంక్షన్లు, ఇతర రోజుల్లోనూ చికెన్‌కు గిరాకీ ఎక్కువే. అయితే, ప్రస్తుతం చికెన్ ప్రియులకు బిగ్ షాకింగ్ న్యూస్. ఎందుకంటే.. వాటి ధరలు భారీగా పెరిగాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఏకంగా కిలో చికెన్ రేటు రూ.340కి చేరింది. పలు ప్రాంతాల్లో రూ.360 వరకు విక్రయిస్తున్న పరిస్థితి.

Also Read : Heat Wave Alert : ఏపీ, తెలంగాణలోని ప్రజలకు బిగ్‌ అలర్ట్.. అప్పుడే హడలెత్తిస్తున్న ఎండలు.. ఏప్రిల్, మేలో చుక్కలే.. ఈ జిల్లాల్లో అధికం.. వాతావరణశాఖ సంచలన విషయాలు

చికెన్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే కిలోపై రూ.50 నుంచి రూ. 100 వరకు పెరిగాయి. రానున్న వారంరోజుల్లో ఈ ధర రూ.400 వరకు చేరుకునే అవకాశం ఉన్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్లో లైవ్ బర్డ్ (ఒకటి) రూ.178 నుంచి రూ.180వరకు పలుకుతోంది. స్కిన్‌తో కేజీ చికెన్ రూ.290 వరకు ఉండగా.. స్కిన్ లెస్ చికెన్ రూ.310 దాటేసింది. రిటైల్ మార్కెట్లో రూ.20 నుంచి రూ.30 వరకు అదనంగా పెంచి విక్రయిస్తున్న పరిస్థితి.

ప్రస్తుతం రంజాన్ మాసంతోపాటు పెండ్లిళ్ల సీజన్ మొదలైంది. తెలంగాణ జిల్లాల్లో అధికశాతం ఫంక్షన్లలో ఎక్కువగా చికెన్ వినియోగిస్తారు. దీంతో చికెన్ ధరలు భారీగా పెరుగుతున్నాయని భావిస్తున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో కిలో చికెన్ రూ.400 దాటే అవకాశాలు ఉన్నాయని చికెన్ దుకాణందారులు, ఫౌల్ట్రీ యాజమానులు అంచనా వేస్తున్నాయి. అయితే, ఇక్కడ ప్రధాన కారణం ఏమిటంటే.. రంజాన్, ఫంక్షన్ల కంటే.. వాతావరణంలో మార్పులతో చికెన్ ధరలు పెరుగుతున్నాయని పలువురు వ్యాపారులు పేర్కొంటున్నారు.

చికెన్ ధరలు పెరగడానికి మరో ప్రధాన కారణం.. ఫౌల్ట్రీల్లో కోళ్లు చనిపోతుండటమేనని తెలుస్తోంది. పలు జిల్లాల్లోని ఫౌల్ట్రీల్లో కొక్కెర వ్యాధితో కోళ్లు చనిపోతుండడంతో ఫారం నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. వనపర్తి మండలం పెద్దగూడెంలోని ఒక ఫౌల్ట్రీ రైతు షెడ్ లో 3వేల కోళ్లు చనిపోయాయి. నిర్వాహకుడు వాటిని పెబ్బేరు రోడ్డులోని అటవీ ప్రాంతంలో లోయలో పారబోశాడు. విషయం తెలుసుకున్న పశు సంవర్ధకశాఖ అధికారులు వాటిని పరిశీలించగా.. కొక్కెర తెగులుతో చనిపోయినట్లు నిర్ధారించారు. వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో పౌల్ట్రీ రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలు దాటేసింది.. మరో రెండుమూడు రోజుల్లో 40డిగ్రీలకు చేరే అవకాశం ఉంది. దీంతో కొక్కెర తెగులు సోకుతుందని ఫౌల్ట్రీ యాజమానులు ఆందోళన చెందుతున్నారు.

పొద్దంతా ఎండల తీవ్రత.. రాత్రి వేళల్లో చలి. ఇలా వాతావరణంలో మార్పులతో కోళ్లు చనిపోతున్నాయని పలువురు పౌల్ట్రీ వ్యాపారులు పేర్కొంటున్నారు. ఎన్ని మందులు వాడుతున్నా కోళ్లు బతకడం లేదని, చివరకు దానా ఖర్చులు కూడా చేతికి రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. ఈ వేసవి కాలంలో కిలో చికెన్ ధర రూ.400 మార్క్ ను దాటే అవకాశాలు కూడా ఉన్నాయన్న వాదన ఉంది.