×
Ad

CM KCR : పార్టీ అభ్యర్థులతో సీఎం కేసీఆర్ సమావేశం.. కీలక అంశాలపై అభ్యర్థులకు దిశా నిర్దేశం

కచ్చితంగా న్యాయ కోవిదులను సంప్రదించాలని సూచించారు. ఎన్నికకు కొత్త నిబంధన వస్తున్నాయని తెలిపారు. తమ దగ్గర న్యాయవాదుల టీమ్ ఉందన్నారు.

  • Published On : October 15, 2023 / 02:26 PM IST

CM KCR directions

CM KCR Directions Candidates : సీఎం కేసీఆర్ పార్టీ అభ్యర్థులతో సమావేశం అయ్యారు. కీలక అంశాలపై అభ్యర్థులకు కేసిఆర్ దిశా నిర్దేశం చేశారు. నామినేషన్లకు ఇంకా సమయం ఉందని, హైరానా పడకండన్నారు. ముందుగానే బీ ఫామ్ ఇస్తున్నామని తెలిపారు. జాగ్రత్తగా బీ ఫామ్స్ నింపాలని సూచించారు. చివరి రోజు వరకు సమయం ఉంది ఆగమాగం అవకండన్నారు. చివరి రోజే అందరూ వేయాలని ఇబ్బంది పడకండని తెలిపారు.

బీ ఫామ్స్ తప్పుగా నింపకండని, టెక్నికల్ సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. శ్రీనివాస్ గౌడ్ , గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణ మోహన్ రెడ్డి తో పాటు కొంత మంది తప్పుగా అఫిడవిట్ ఇచ్చారని కేసులు పెట్టారని అలాంటి అజాగ్రత్త ఉండకండన్నారు. న్యాయ కోవిదులు ఉన్నారని అంతా తమకే తెలుసు అనుకోకండని తెలిపారు.

Telangana Congress : టికెట్ పోటీ ఉన్న స్థానాలకు అభ్యర్థులను ప్రకటించని కాంగ్రెస్.. సిరిసిల్లలో కేటీఆర్ కు ప్రత్యర్థిగా అభ్యర్థిని ప్రకటించని అధిష్టానం

కచ్చితంగా న్యాయ కోవిదులను సంప్రదించాలని సూచించారు. ఎన్నికకు కొత్త నిబంధన వస్తున్నాయని తెలిపారు. తమ దగ్గర న్యాయవాదుల టీమ్ ఉందన్నారు. అప్ డేట్ ఓటర్ లిస్ట్ వచ్చిందని చెప్పారు. ఇవాళ, రేపు కూడా బీ ఫామ్ ఇస్తామని తెలిపారు. ఇవాళ ఒక్కరోజే 51 మందికి బీ ఫామ్ ఇస్తున్నామని వెల్లడించారు.