CM KCR : నవంబర్ 4 నుంచి యథావిధిగా దళితబంధు : సీఎం కేసీఆర్
దళితబంధుపై సీఎం కేసీఆర్ స్పందించారు. ఈసీ తన పరిధిని అతిక్రమించిందన్నారు. దళితబంధును ఈసీ ఎన్ని రోజులు ఆపగలదన్నారు. దళితబంధు విషయంలో ఎవరూ చింతించాల్సిన అవసరం లేదన్నారు.
- bheemraj
- Published On : October 19, 2021 / 08:58 PM IST
Cm Kcr (1)
Dalitbandhu scheme : దళితబంధుపై సీఎం కేసీఆర్ స్పందించారు. ఈసీ తన పరిధిని అతిక్రమించిందన్నారు. దళితబంధును ఈసీ ఎన్ని రోజులు ఆపగలదన్నారు. దళితబంధు విషయంలో ఎవరూ చింతించాల్సిన అవసరం లేదన్నారు. దళితబంధు అర్హులు ఆందోళన చెందవద్దన్నారు. ఉప ఎన్నిక తర్వాత తన చేతుల మీదుగా దళితబంధు పంపిణీ చేస్తానని తెలిపారు. దళితబంధు ఆన్ గోయింగ్ స్కీమ్ అన్నారు. నవంబర్ 4 నుంచి యథావిధిగా దళితబంధు అమలవుతుందన్నారు.
హుజురాబాద్ ఉపఎన్నికల వేళ సీఎం కేసీఆర్‌కి కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. హుజురాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న ‘దళిత బంధు’ను వెంటనే నిలిపివేయాలంటూ నిన్న ఆదేశాలు జారీ చేసింది. ఉపఎన్నిక తర్వాత దళితబంధును యథావిథిగా కొనసాగించుకోవచ్చునని స్పష్టం చేసింది.
Huzurabad ByPoll : దళితబంధును వెంటనే నిలిపివేయాలి.. ఈసీ ఆదేశం!
హుజురాబాద్‌లో ఉపఎన్నికలు ఉన్నందున దళితబంధుతో ఓటర్లు ప్రలోభాలకు గురయ్యే అవకాశం ఉందని ఈసీ అభిప్రాయపడింది. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఈ పథకాన్ని తిరిగి అమలు చేసుకోవచ్చని సూచించింది.
సీఎం కేసీఆర్ దళితబంధును ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద అర్హులైన దళితులకు రూ.10 లక్షలు అందిస్తున్నారు. ఇప్పటికే హుజూరాబాద్, వాసాలమర్రిలో అర్హులైన దళిత కుటుంబాలకు ‘దళితబంధు’ నిధులను విడుదల చేశారు. మూడు విడతల్లో ఈ డబ్బులను వారి ఖాతాల్లోకి జమ చేశారు.
