Cm Revanth Reddy: ఆ 45 ఎకరాల భూమి ఏమైంది? ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు!

ఎర్రవల్లి, వెంకటాపురం భూములపై ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి(Cm Revanth Reddy) ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

CM Revanth key review on Erravalli lands and notices issued to KCR family

Cm Revanth Reddy: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి, వెంకటాపురం గ్రామాల పరిధిలోని భూములపై ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి(Cm Revanth Reddy) ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రెండు గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే వివరాలను అధికారులు ఈ సమావేశంలో సీఎంకు సమగ్రంగా అందించారు. సర్వే నెంబర్ 325 పరిధిలో రెవెన్యూ రికార్డుల ప్రకారం 388 ఎకరాల భూమి నమోదై ఉండగా, క్షేత్రస్థాయి పరిశీలనలో మాత్రం కేవలం 343 ఎకరాలు మాత్రమే తేలిందని అధికారులు పేర్కొన్నారు. ఈ వ్యత్యాసంపై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి, మాయమైన ఆ 45 ఎకరాల భూమి ఎక్కడికి పోయిందో తక్షణమే విచారించి తేల్చాలని అధికారులను ఆదేశించారు.

DMK Party: విజయ్ కి భయపడుతున్నారా? కాంగ్రెస్ డబుల్ గేమ్‌పై డీఎంకే ఫైర్.. సంచలన వ్యాఖ్యలు!

కేసీఆర్ కుటుంబానికి నోటీసులు.. సర్వే నోటిఫికేషన్ విడుదలకు సిద్ధం:

ఈ భూ వివాదంపై సమగ్ర విచారణలో భాగంగా త్వరలోనే ఎర్రవల్లి, వెంకటాపురం పరిధిలో భూమి గుర్తింపు కోసం కొత్తగా సర్వే నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వే నెంబర్ 325కి సంబంధించిన అసలైన రెవెన్యూ రికార్డులు, ఆధారాలు సమర్పించాలని మాజీ సీఎం కేసీఆర్ కుటుంబానికి అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి ఎకరా భూమిని కచ్చితంగా లెక్కించి, అక్రమాలు ఏవైనా జరిగితే కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.

అమరవీరుల కాలనీ నిర్మాణం.. జూన్ 2 నాటికి పూర్తి చేయాలని గడువు:

అలాగే వివాదాస్పద సర్వే నంబర్ 325లో తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మించి, అమరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ డబుల్ బెడ్‌రూమ్స్ లేదా ఇళ్ల నిర్మాణ బాధ్యతలను తెలంగాణ హౌసింగ్ బోర్డుకు అప్పగించాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే తెలంగాణ అవతరణ దినోత్సవం అయిన జూన్ 2వ తేదీ నాటికి ఈ అమరవీరుల కాలనీ నిర్మాణాన్ని పూర్తి చేసి అర్హులైన కుటుంబాలకు అందజేయాలని అధికారులకు స్పష్టమైన గడువు విధించారు.