Cm Revanth Reddy: ఉన్న పార్టీకే దిక్కులేదు, ఇక కొత్త పార్టీ ఎందుకు? కవిత పార్టీపై సీఎం రేవంత్..

బీఆర్ఎస్ పార్టీ చచ్చిన శవంతో సమానం అన్న రేవంత్.. శవానికి ఎంత అలంకరణ చేసినా ఉపయోగం లేదన్నారు.

  • Updated on- April 27, 2026 / 06:04 PM IST

Cm Revanth Reddy: కవిత్త కొత్త పార్టీపై చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఉన్న పార్టీకే దిక్కు లేదు, ఇక కొత్త పార్టీ ఎందుకు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కొత్త పార్టీ సంగతి పక్కన పెట్టండి, ఉన్న బీఆర్ఎస్ ఉంటుందో పోతుందో చూసుకోండి అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పార్టీకి మనుగడ లేదన్నారు రేవంత్. బీఆర్ఎస్ పార్టీ చచ్చిన శవంతో సమానం అన్న రేవంత్.. శవానికి ఎంత అలంకరణ చేసినా ఉపయోగం లేదన్నారు. అధికారం అడ్డం పెట్టుకుని పదేళ్ల పాటు అహంకారంతో పని చేశారని నిప్పులు చెరిగారు. చివరికి ప్రజలు భరించలేక అధికారం నుంచి దింపేశారని అన్నారు. బీఆర్ఎస్ కు గతం మాత్రమే ఉంది, భవిష్యత్తు లేదు అంటూ హాట్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్. కేసీఆర్ కుటుంబానికి, బీఆర్ఎస్ పార్టీకి ప్రజలతో సంబంధాలు లేవని విమర్శించారు.

Also Read: ఇదో చిల్లర ప్రభుత్వం.. కేసీఆర్ ఫుల్ ఫైర్.. పార్టీ కమిటీలన్నీ రద్దు..

కాళేశ్వరం అంశంపైనా రేవంత్ స్పందించారు. కాళేశ్వరం కేసును కావాలనే సీబీఐ కాలయాపన చేస్తోందని సీఎం రేవంత్ ఆరోపించారు. కాళేశ్వరంపై విచారణ జరిపించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కాళేశ్వరం విషయంలో సీబీఐ డైరెక్టర్ ను కలిసి ఒత్తిడి తెస్తామన్నారు. కేంద్రం విచారణ జరపకపోతే తమ కార్యాచరణ ఉంటుందన్నారు. కాళేశ్వరంపై సీబీఐకి వివరాలు ఇచ్చేందుకు సిద్ధమన్న ముఖ్యమంత్రి రేవంత్.. 48 గంటల్లో సీబీఐ విచారణ చేయిస్తామన్న కిషన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.

అటు కమిషన్ కరెక్ట్ అని కోర్టు చెప్పడం బీఆర్ఎస్ గెలిచినట్లా అని రేవంత్ ప్రశ్నించారు. కమిషన్ రిపోర్టును కొట్టివేయాలని హరీశ్ రావు కోరారని, కమిషన్ చట్టబద్ధం కాబట్టి రిపోర్టును కొట్టివేయలేము అని కోర్టు చెప్పిందన్నారు. ఘోష్ కమిషన్ చట్టబద్ధం అని కోర్టు చెప్పిందన్నారు. కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చ చేసి సీబీఐకి అప్పగించామని, కాళేశ్వరంలో ఎవరు బాధ్యులు, ఏ శిక్షలు వేయాలి అనేది సీబీఐ నిర్ణయిందన్నారు సీఎం రేవంత్.

కోర్టు చెప్పింది ఒకటి, హరీశ్ ప్రచారం చేసుకుంటుంది మరొకటి..

”కేసీఆర్ ఇంటికి కూడా వాటర్ ట్యాంక్ పంపుతున్నాం. మేము వివక్ష లేని పాలన చేస్తున్నాం. కాళేశ్వరంపై కోర్టుకు వెళ్లింది ఒకటి, హరీష్ ప్రచారం చేసుకుంటుంది ఒకటి. కమిషన్ ఏర్పాటు ఏకపక్షం కాదు, రాజ్యాంగ విరుద్ధం కాదు, చట్టబద్ధమని కోర్టు చెప్పింది. కమిషన్ కరెక్ట్ అని చెప్పడం బీఆర్ఎస్ గెలిచినట్లా? కమిషన్ రిపోర్టును కొట్టివేయాలని హరీశ్ రావు కోర్టును కోరారు. కమిషన్ చట్టబద్ధం కాబట్టి రిపోర్టును కొట్టేయలేమని కోర్టు చెప్పింది. సెక్షన్ 8 బి ప్రొసీజర్ ల్యాప్ మాత్రమే అని కోర్టు తప్పుపట్టింది. కోర్టు క్లారిటీగా చెప్పినా బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. 1952 ఎంక్వైరీకి చట్టం ప్రకారం సహజ సూత్రం పాటించలేదు కాబట్టి ఇప్పటికిప్పుడు చర్యలు వద్దని మాత్రమే కోర్టు చెప్పింది. 8 బి కాకుండా సాక్షిలా స్టేట్ మెంట్ ఇచ్చామని వాళ్ళు అన్నారు. దీనికి కోర్టు సానుకూలంగా మాత్రమే స్పందించింది” అని రేవంత్ అన్నారు.