Cm Revanth Reddy: అక్రమ మైనింగ్‌పై సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. సీబీసీఐడీ విచారణకు ఆదేశం
ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే ఎలాంటి తప్పిదాలు జరిగినా తమ ప్రభుత్వం ఉపేక్షించదని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.
- Naveen
- Published On : March 28, 2026 / 05:00 PM IST
Cm Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో అక్రమ మైనింగ్ అంశం మంటలు రాజేసింది. అక్రమ మైనింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీబీసీఐడీ విచారణకు ఆదేశించారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు అక్రమ మైనింగ్ లపై సీబీసీఐడీ విచారణ జరుపుతామన్నారు. రాఘవ కన్ స్ట్రక్షన్ సహా అన్ని మైనింగ్ లపైనా విచారణ జరిపిస్తామన్నారు. గంగుల, వద్దిరాజు కంపెనీల మైనింగ్ పై విచారణ చేయిస్తామన్నారు. సిరిసిల్ల ఇసుక మాఫియాపైనా విచారణ చేయిస్తామన్నారు. మైనింగ్ లీజులపై విచారణ చేయిస్తామన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే ఎలాంటి తప్పిదాలు జరిగినా తమ ప్రభుత్వం ఉపేక్షించదని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.
అందులో భాగంగానే రాఘవ కన్ స్ట్రక్షన్స్ కు నోటీసులు ఇచ్చిందని, చర్యలు తీసుకోమందని తెలిపింది. రాఘవ కన్ స్ట్రక్షన్ నుంచి మైనింగ్ శాఖ ఫైన్ కట్టించుకుందని తెలిపారు. ఇది వాళ్లు కనిపెట్టి పిర్యాదు చేస్తే తీసుకున్న చర్యలు కాదన్నారు. మా ప్రభుత్వమే వివరాలు తీసుకుని చర్యలు తీసుకుందని వివరించారు. మంత్రిపై బురద చల్లాలని, వాళ్ల పైరవీలకు సహకరించడం లేదని బ్లాక్ మెయిల్ చేయాలని ప్రయత్నిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. వాళ్ల బ్లాక్ మెయిల్ లకు ప్రభుత్వం లొంగదన్నారు. సీబీసీఐడీ విచారణతో నిజాలు నిగ్గు తేలుస్తామన్నారు.
సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ పచ్చి అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. రాఘవ కన్ స్ట్రక్షన్స్ మంత్రి పొంగులేటిది కాదని ముఖ్యమంత్రి చెప్పడం దుర్మార్గం అన్నారు హరీశ్ రావు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి భార్య, కొడుకు, తమ్ముడు.. దూరపు బంధువులు ఎలా అవుతారు? అని ప్రశ్నించారు.
రాఘవ పేరు స్వయాన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తండ్రి పేరు.. ఆ కంపెనీ ఆయనదేనని లోకమంతా తెలుసు. రాఘవ కన్ స్ట్రక్షన్స్ డైరెక్టర్లుగా ఉన్నది పొంగులేటి సతీమణి మాధురి, కొడుకు హర్షరెడ్డి, తమ్ముడు ప్రసాద్ రెడ్డే. అసెంబ్లీని తప్పుదోవ పట్టించారు సీఎం రేవంత్. సభలో కాంగ్రెస్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్, అక్రమాలపై ప్రశ్నిస్తే డొంకతిరుగుడు సమాధానాలా? రాఘవ కన్ స్ట్రక్షన్స్ అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. జవాబుదారీతనం లేకుండా సభలో దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ పాలకుల తీరు శోచనీయం” అని మాజీ మంత్రి హరీశ్ రావు వాపోయారు.
Also Read: మహిళా రిజర్వేషన్లు.. భార్య, కూతుళ్లు, కోడళ్లను బరిలో దించేందుకు రెడీ అవుతున్న లీడర్లు ఎవరు?
