×
Ad

CM Revanth: కలెక్టర్లతో సీఎం రేవంత్ సమావేశం.. సంక్షేమ పథకాలపై కీలక ఆదేశాలు

సచివాలయంలో జరిగిన మీటింగ్ లో కలెక్టర్లకు క్లాస్ పీకిన సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth).

CM Revanth reddy meeting with collectors

CM Revanth: సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం సచివాలయంలో కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. నిజమైన అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని, గ్రామ సభల్లో సంక్షేమ పథకాల వారీగా ప్రభుత్వం చేకూరుస్తున్న లబ్ధిని ప్రజలకు వివరించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’పై సీఎం రేవంత్ కలెక్టర్లకు కీలక సూచనలు చేశారు.

Andhra Pradesh: రోడ్లు బాగు చేయండి.. మోకాళ్లపై మోకరిల్లి.. గోడు వెళ్లబోసుకున్న విద్యార్థులు

99 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రోగ్రాంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా వరకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం అవ్వలన్నారు. ప్రజా ప్రభుత్వంలో అందిస్తున్న సంక్షేమ పథకాలు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం లబ్ధిదారుల అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. అలాగే, విద్యా వ్యవస్థలో కూడా ప్రభుత్వం తీసుకువస్తున్న మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు(CM Revanth).

ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్టం చేయడం, వాటిని దగ్గరలోని మెడికల్ కాలేజీలతో అనుసంధానం చేయడం వల్ల ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. మధ్యాహ్న భోజనం పథకం కింద ఏజెన్సీలకు ప్రతి నెలా చెల్లింపులు కచ్చితంగా అందేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఇక ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు.