Narendra Modi: ప్రధాని మోడీతో సీఎం రేవంత్ భేటీ.. హైదరాబాద్ అభివృద్ధిపై ఫోకస్

నీతి ఆయోగ్ సమావేశం అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi)తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

CM Revanth Reddy met Prime Minister Modi after the NITI Aayog meeting

  • మోదీతో సీఎం రేవంత్ భేటీ
  • అభివృద్ధి, మెట్రో ఫేజ్–2 ఖట్టర్ సమావేశం
  • మూసీ ప్రక్షాళన పట్టణాభివృద్ధి ప్రణాళికలు

Narendra Modi: నీతి ఆయోగ్ సమావేశం అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi)తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలను ఆయన ప్రధానితో చర్చించారు. ముఖ్యంగా నిధుల కేటాయింపు, మౌలిక వసతుల అభివృద్ధి, కేంద్ర–రాష్ట్ర సహకారంపై దృష్టి సారించినట్లు సమాచారం. రాష్ట్ర అవసరాలను కేంద్రానికి వివరించారు.

EVM Fire: బెంగాల్‌ అలీపుర్ ప్రభుత్వ భవనంలో అగ్ని ప్రమాదం.. 4,000 ఈవీఎంలు దగ్ధం

తరువాత సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో సమావేశమయ్యారు. ఈ భేటీలో హైదరాబాద్ మెట్రో ఫేజ్–2 ప్రాజెక్టు పురోగతి, కేంద్ర సహకారం, అలాగే ప్రాజెక్టుకు సంబంధించిన ఆమోద ప్రక్రియలపై చర్చ జరిగింది. నగర రవాణా వ్యవస్థను మెరుగుపరచడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.

అలాగే మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టు, పట్టణాభివృద్ధి కార్యక్రమాలపై కూడా విస్తృతంగా చర్చించారు. హైదరాబాద్ నగరాన్ని సుస్థిర, ఆధునిక నగరంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్ర సహకారం అవసరమని సీఎం వివరించారు. ఈ సమావేశాలు రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలకు కొత్త ఊపును ఇచ్చే అవకాశముందని భావిస్తున్నారు.