Cm Revanth Reddy: రాజకీయ కుట్రలో భాగమే, దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం- డీలిమిటేషన్ పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

డీలిమిటేషన్ పై ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అభిప్రాయాలు తీసుకోవాలి. ఈ అంతరం దేశ మనుగడకు మంచిది కాదు.

  • Published On : April 13, 2026 / 05:57 PM IST

 

Cm Revanth Reddy: ప్రధాని మోదీ డీలిమిటేషన్ విధానంతో చిన్న రాష్ట్రాలు మరింత చిన్నగా, పెద్ద రాష్ట్రాలు మరింత పెద్దవిగా మారతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇది దక్షిణాదికి తీవ్ర అన్యాయం చేస్తుందని ఆరోపించారు. హైబ్రిడ్ మోడల్ లో డీలిమిటేషన్ చేయాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ కారణంగా చిన్న రాష్ట్రాలకు కూడా తీవ్ర విఘాతం కలుగుతుందని సీఎం రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపాదికన ఏర్పాటు పడిన విధానానికి తూట్లు పొడుస్తుందన్నారు. దేశ మనుగడకు మంచిది కాదన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. మహిళలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

”నియోజకవర్గాల విభజనలో భాగంగా 1957లో 494 సీట్లు ఉన్నాయి. 1967లో 520 సీట్లు చేశారు. 1971 జనగనణ ప్రకారం 542 చేశారు. సిక్కిం నుండి యాడ్ అయ్యాక మొత్తం 543 ఎంపీ సీట్లు అయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 42 ఎంపీ సీట్లు. ఇందిరా గాంధీ నియోజకవర్గాల పునః విభజన చేయాలని అనుకోలేదు. నరేంద్ర మోదీ చేస్తున్న చర్యల వలన ఉత్తరాదిన జనాభా విపరీతంగా పెరిగిపోయింది. దీని వలన దక్షిణాధి రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఇప్పుడు దమాషా ప్రకారం నియోజకవర్గాలు పెంచుతాం అంటున్నారు.

దక్షిణాదికి రాజకీయంగా విఘాతం..

ఇప్పుడు మోదీ సర్కార్..దక్షిణాది రాష్ట్రాలకు కీలక పదవులు ఇవ్వలేదు. బలహీనులగా మార్చి ఉత్తరాదికి మరింత బలంగా మార్చాలని మోదీ చూస్తున్నారు. దక్షిణాదికి రాజకీయంగా విఘాతం కలుగుతుంది. డీలిమిటేషన్ పై ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అభిప్రాయాలు తీసుకోవాలి. ఈ అంతరం దేశ మనుగడకు మంచిది కాదు. వివక్ష చూపితే ఎక్కడికైనా పరిస్థితులు దారితీస్తుంది. శిఖండిని అడ్డుపెట్టుకుని యుద్ధం చేసినట్లు మహిళా బిల్లును అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు మోదీ. దీని వెనుకున్న కుట్రను ప్రజలకు చెబుతున్నాం. దక్షిణాది.. పన్నులు కట్టాలా, సలాం కొట్టాలా.. దీనికి మేము వ్యతిరేకం.

దేశ స్థూల ఆర్ధిక ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయండి. 50 శాతం జీఎస్టీపీ డీలిమిటేషన్ జరగాలి. దక్షిణ, ఉత్తదికి తీవ్ర అంతరం ఏర్పడుతుంది. మమ్మల్ని ద్వితీయ శ్రేణిగా చూడొద్దు. 50 శాతం 136 ప్రో రేటా ప్రకారం, మిగతా 50 శాతం జీఎస్టీపీ ప్రాతిపదికన చేయాలి. డీలిమిటేషన్ పై రాష్ట్రాల, అసెంబ్లీ, ప్రజలతో, పార్టీలతో వివిధ వర్గాలతో అభిప్రాయాలు తీసుకోవాలి. హడావిడిగా, అడ్డుగోలుగా ప్రయత్నం చేయవద్దు.

డీలిమిటేషన్ పార్టీలకు సంబంధించింది కాదు. కేంద్రం హడావిడితో దేశానికి, ప్రజలకు జరిగే నష్టంపై మాట్లాడుతున్నాం. ఈ నెల 17, 18 తేదీలలో ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని చూస్తుంది. మహిళా రిజర్వేషన్, డీ లిమిటేషన్ ఒకటిగా చూపే ప్రయత్నం కేంద్రం చేస్తోంది. విడివిడిగా చూడాలన్నదే మా ఉద్దేశ్యం. మహిళా రిజర్వేషన్ కు కాంగ్రెస్ వ్యతిరేకం అన్నట్లు బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుంది. పురుషులతో సమానంగా మహిళలకు ఓటు హక్కును ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ప్రధానిగా, రాష్ట్రపతిగా, సీఎంగా, గవర్నర్లుగా మహిళలకు అవకాశం కల్పించింది కాంగ్రెస్. వారి నాయకత్వంలో పని చేసింది కాంగ్రెస్.

రాజకీయ కుట్ర, రాజకీయ అసమానతలు ఉన్నాయి..

మహిళా రిజర్వేషన్ ఉండాలని యూపీఏ సర్కార్ బిల్లు పెడితే నాడు బీజేపీ అడ్డుకుంది. పదేళ్లు మోదీ సర్కార్ పక్కన పెట్టింది. 2026 జనాభా లెక్కల ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేస్తామని గతంలో కేంద్రం బిల్లులో చెప్పింది. చట్టంలో ఫిట్టింగ్ పెట్టి నాడు మహిళా రిజర్వేషన్ అడ్డుకుంది బీజేపీ. ఇప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ చేయాలని చూస్తుంది. రాజకీయ కుట్ర, రాజకీయ అసమానతలు ఉన్నాయి. మహిళా రిజర్వేషన్ 100 శాతం స్వాగతిస్తున్నాం. చర్చ కూడా అవసరం లేకుండా మద్దతిస్తాం. ప్రస్తుతం ఉన్న సీట్లలో 33 శాతం రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. డీలిటిమిటేష న్ ను మోదీ రాజకీయంగా వాడుకుంటున్నారు.

1971 లో జనగణన ప్రకారం డీలిటిటేషన్ చేశారు. కుటుంబనియంత్రణతో దక్షిణాదిన జనాభా తగ్గితే ఉత్తరాదిన జరగలేదు. రాష్ట్రాల మధ్య అంతరం పెరిగింది. ఇందిరమ్మ దూర దృష్టితో రాష్ట్రాలవారీగా నిర్వహించాలని నిర్ణయించింది. జనాభా ప్రాతిపదికన చేస్తామంటే మేము దక్షిణాది సీఎంలుగా తీవ్రంగా వ్యతిరేకించి ప్రధానికి లేఖ రాస్తాం. 50 శాతంతో పెంచితే పూర్తిగా ఉత్తరాది రాష్ట్రాలకు భారీగా సీట్లు పెరుగుతాయి. అప్పుడు దక్షిణాది రాజకీయంగా నష్టపోతుంది.

దేశ ఆర్ధిక వ్యవస్థలో 50 శాతంకిపైగా ఆదాయాన్ని ఇస్తున్నది దక్షిణాది రాష్ట్రాలే. మా మెరిట్ కు 50శాతం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఏప్రిల్ 6 1980 నుండి పదిహేను మంది అధ్యక్షులుగా ఉన్నారు. 46 ఏళ్లలో ఒక్క మహిళనైనా అధ్యక్షురాలిని చేశారా. బండి సంజయ్ చెప్పాలి. దక్షిణాది మహిళా ఎస్సీ, ఎస్టీ, మహిళలకు వ్యతిరేకంగా బండి మాట్లాడుతున్నారు. లక్ష్మణ్ యూపీకి వెళ్లారు. ఇక బండి కూడా అటే వెళతారేమో?” అని రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read: ఆర్టీసీ సమ్మె.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు.. మేము సిద్ధం