CM Revanth Reddy : హైడ్రా అంటే హిట్లర్ కోర్ టీమ్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్..

CM Revanth Reddy : బెంగళూరులో జరుగుతున్నఓ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. హైడ్రా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా అంటే హిట్లర్ కోర్ టీమ్ పేరని అన్నారు.

CM Revanth Reddy

  • హైడ్రాపై సీఎం రేవంత్ కీలక కామెంట్స్
  • హైడ్రా అంటే హిట్లర్ కోర్ టీం అంటూ వెల్లడి
  • హైడ్రా అనే పేరు హిట్లర్‌కు చాలా ఇష్టమన్న సీఎం

CM Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారు. నగరంలో విపత్తు నిర్వహణ, ప్రజా ఆస్తుల రక్షణ, పట్టణ నియంత్రణ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవడానికి ఏర్పాటైన సంస్థే హైడ్రా. గత కొంతకాలంగా హైడ్రా బాగా ఫేమస్ అయింది.. అదే సమయంలో అనేక వివాదాలకు కేంద్ర బింధువైంది. 2024 జులైలో సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను అధికారికంగా ప్రకటించారు.

Also Read : Silver Hallmarking : వెండి హాల్‌మార్కింగ్ తప్పనిసరి అవుతుందా..? ఎదురయ్యే సవాళ్లపై బీఐఎస్‌ అధ్యయనం

హైడ్రా కమిషనర్ గా ఏవీ రంగనాథ్ ను నియమించారు. అంతేకాదు.. ప్రత్యేక టీంను కూడా ఏర్పాటు చేశారు. నగరంలోని అక్రమ కట్టడాలపై హైడ్రా నిర్దాక్షిణ్యంగా కొరడా ఝుళిపిస్తుంది. ఈ క్రమంలో అనేక మంది నుంచి ప్రశంసలు అందుకుంటుండగా.. మరికొందరి నుంచి విమర్శలు ఎదుర్కొంటుంది. ప్రతిపక్ష పార్టీలతోపాటు అధికార పార్టీలోని కొందరు హైడ్రా తీరుపై అసంతృప్తినిసైతం వ్యక్తం చేశారు. అయితే, తాజాగా. హైడ్రాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు.

బెంగళూరులో జరుగుతున్న ది హిందూ హడిల్ ఆరో ఎడిషన్ సదస్సులో రెండోరోజైన శనివారం సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన హైడ్రా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఛాలెంజింగ్ గా తీసుకొని జలవనరుల పరిరక్షణకు హైడ్రాను ప్రారంభించామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అసలు హైడ్రా అనేది హిట్లర్ కోర్ టీమ్ పేరనీ, ఆనాడు హిట్లర్ నడిపిన విభాగాన్ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ హైడ్రాను ఏర్పాటు చేశామని చెప్పారు. హైడ్రా అనే పేరు హిట్లర్ కు చాలా ఇష్టమని, హిట్లర్ కు చాలా దగ్గరగా ఉన్న హంతక ముఠా పేరు హైడ్రా అని సీఎం రేవంత్ తెలిపారు. పేద ప్రజలు చెరువులను ఆక్రమిస్తే మానవతా దృక్పథంతో అర్ధం చేసుకోవచ్చని, కానీ, ధనికులే జలాశయాలను ఆక్రమిస్తుండడం వల్ల తాము హైడ్రాను ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటూ రేవంత్ చెప్పుకొచ్చారు.

అయితే, సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారాన్ని రేపుతున్నాయి. సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు రేవంత్ వ్యాఖ్యలపై తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఎవరైనా మంచి పాలకులను ఆదర్శంగా తీసుకొంటారు. ప్రపంచ యుద్ధానికి కారణమైన, కోట్ల మంది చావుకు కారణమైన హిట్లర్ వంటి క్రూరమైన నియంతను ఎవరైనా రోల్ మోడల్ గా తీసుకుంటారా..? అంటూ మండిపడుతున్నారు.