CM Revanth Reddy : భారత్ సమిట్‌పై విపక్షాల విమర్శలు.. గట్టిగా కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్!

CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా నిర్వహిస్తున్న భారత్ సమిట్‌పై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇస్తూ, 70 దేశాల నుంచి ప్రతినిధులు హాజరైనట్లు వెల్లడించారు.

CM Revanth Reddy Targets Opposition

  • తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యం..
  • భారత్ సమిట్‌పై రేవంత్ కీలక వ్యాఖ్యలు
  • హైదరాబాద్ వేదికగా గ్లోబల్ ఫోకస్..
  • భారత్ సమిట్‌తో తెలంగాణకు కొత్త గుర్తింపు

CM Revanth Reddy : తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న భారత్ సమిట్ ఇప్పుడు రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గట్టిగానే బదులిచ్చారు. తెలంగాణకు మంచి పేరు తీసుకురావడంతో పాటు, రాష్ట్రంలోని అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయడమే సమిట్ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు..

70 దేశాల నుంచి వెయ్యికిపైగా ప్రతినిధులు :
హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. గ్లోబల్ సమిట్‌కు ముందుగానే భారత్ సమిట్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే బెంగళూరు, చెన్నై, ఢిల్లీలో సన్నాహక కార్యక్రమాలు చేపట్టామని, త్వరలో ముంబై, అహ్మదాబాద్‌లోనూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దాదాపు 70 దేశాల నుంచి వెయ్యి మంది ప్రతినిధులు ఈ సమిట్‌కు హాజరైనట్లు చెప్పారు..

Read Also : Samsung Galaxy F70 5G : రూ.30వేల శాంసంగ్ 5G ఫోన్ ఇప్పుడు రూ.18 వేలకే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొన్నారంటే..

కేంద్రంపై రేవంత్ ఆరోపణలు :
అయితే, కొంతమంది ప్రతినిధులను చివరి నిమిషంలో కేంద్ర ప్రభుత్వం అడ్డుకుందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తర్వాత కూడా కొందరు వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.

మరోవైపు, భారత్ సమిట్ కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపైనా సీఎం స్పందించారు. కిషన్‌రెడ్డి, రామచందర్‌రావు, కేసీఆర్‌కు ఈ కార్యక్రమంపై ఎందుకంత వ్యతిరేకత ఉందో అర్థం కావడం లేదన్నారు. ఏ అంశం లేకపోయినా విపక్షాలు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు..

2047 నాటికి తెలంగాణ లక్ష్యం ఇదే :
వాతావరణ మార్పులు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు వంటి కీలక అంశాలపై సమిట్‌లో చర్చలు జరుగుతున్నాయని వివరించారు. తెలంగాణ, హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలను విదేశీ ప్రతినిధులకు చూపించి, రాష్ట్రంపై నమ్మకం కలిగించడమే తమ ప్రయత్నమన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని సీఎం రేవంత్ వెల్లడించారు.