Donald Trump Avenue: హైదరాబాద్ రోడ్డుకు అమెరికా అధ్యక్షుడి పేరు.. నగరంలో ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’.. రేవంత్ రెడ్డి మార్క్ గ్లోబల్ ప్లాన్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రామ్‌గూడలో గల అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం ఉన్న రహదారికి 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ (Donald Trump Avenue)'గా పేరు ఖరారు చేయనున్నారు.
- V Santhosh Kumar
- Updated on- June 16, 2026 / 02:47 PM IST
Cm revanth reddy to inaugurate donald trump avenue in hyderabad
- నానక్‌రామ్‌గూడ రోడ్డుకు ట్రంప్ పేరు.
- ఈ నెల 23న ప్రారంభోత్సవం.
- గూగుల్ మైక్రోసాఫ్ట్ పేర్లతో రోడ్లు
Donald Trump Avenue: హైదరాబాద్‌లోని ఒక ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడి పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రామ్‌గూడలో గల అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం ఉన్న రహదారికి ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ(Donald Trump Avenue)’గా పేరు ఖరారు చేయనున్నారు. ఈ నెల 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రహదారిని అధికారికంగా ప్రారంభించనుండగా, ఈ కార్యక్రమానికి భారతదేశంలోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ హాజరుకానున్నారు.
తెలంగాణ, అమెరికాల మధ్య వాణిజ్య, వ్యాపార, పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కేవలం అధ్యక్షుడి పేరే కాకుండా, నగరంలోని మరికొన్ని ప్రధాన రహదారులకు గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రఖ్యాత అంతర్జాతీయ సాంకేతిక సంస్థల పేర్లను పెట్టే ప్రణాళికలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. తెలంగాణను గ్లోబల్ ఐటీ రంగానికి ప్రతీకగా నిలబెట్టడమే దీని ప్రధాన ఉద్దేశం.
గతంలో ఢిల్లీలో జరిగిన యూఎస్-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక (USISPF) సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రతిపాదనను తొలిసారిగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో, అంతర్జాతీయ సంస్థలు మరియు ప్రముఖుల పేర్లను ఇక్కడి రోడ్లకు పెట్టడం ద్వారా హైదరాబాద్ కీర్తి విశ్వవ్యాప్తం అవుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఈ సరికొత్త నిర్ణయం విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించడానికి దోహదపడనుంది.
