Telangana Government: తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.1.20 కోట్ల ఉచిత జీవిత బీమా పథకం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ(Telangana Government) ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షనర్లకు రేవంత్ రెడ్డి సర్కార్ అదిరిపోయే ఉచిత కానుకను ప్రకటించింది.

Cm Revanth Reddy to launch free life insurance scheme for Telangana employees

  • రూ.1.20 కోట్ల ఉచిత బీమా.
  • రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న పథకం.
  • ఉద్యోగులు, పెన్షనర్లకు ఆర్థిక భరోసా.

Telangana Government: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షనర్లకు రేవంత్ రెడ్డి సర్కార్ అదిరిపోయే ఉచిత కానుకను ప్రకటించింది. వారి కుటుంబాలకు పూర్తి ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో సరికొత్త ఉచిత జీవిత బీమా పథకానికి శ్రీకారం చుట్టింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ బీమా పాలసీని ఎల్లుండి హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు. ప్రభుత్వ(Telangana Government) నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Temples Development: ఆరు ఆలయాల అభివృద్ధికి నిధులు.. శ్రీవాణి ట్రస్ట్ కు సర్కార్ అనుమతి

ఈ నూతన పథకం కింద అర్హత కలిగిన ప్రతి ఉద్యోగికి, పెన్షనర్‌కు ఏకంగా రూ. 1.20 కోట్ల వరకు భారీ ఉచిత జీవిత బీమా రక్షణ లభించనుంది. విధి నిర్వహణలో లేదా సాధారణ జీవితంలో ఎదురయ్యే సహజ మరణం, అలాగే దురదృష్టవశాత్తూ జరిగే ప్రమాద మరణం (యాక్సిడెంటల్ డెత్) వంటి అన్ని రకాల అత్యవసర సందర్భాల్లోనూ ఈ బీమా ప్రయోజనాలు వర్తిస్తాయి. బాధితుల కుటుంబాలు రోడ్డున పడకుండా, వారికి తక్షణ ఆర్థిక సాయం అందేలా ప్రభుత్వం ఈ పాలసీలో కఠిన నిబంధనలను పొందుపరిచింది.

ఈ భారీ బీమా పథకాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేసేందుకు గానూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రముఖ జాతీయ బ్యాంకులు, బీమా సంస్థలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమ జీవితాంతం చేసిన సేవలకు గుర్తింపుగా.. వారి తదనంతరం వారి కుటుంబ సభ్యులు గౌరవప్రదంగా బతికేందుకు ఈ ఆర్థిక రక్షణ ఎంతగానో దోహదపడుతుందని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.