Telangana Assembly : కౌశిక్ రెడ్డి వైఖరిపై సభలో దుమారం.. కడియం పట్ల అనుచిత ప్రవర్తన.. సస్పెండ్ చేయాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్
Telangana Assembly : అసెంబ్లీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య మాటల యుద్ధ తీవ్రస్థాయిలో కొనసాగింది.
- Harishth Thanniru
- Published On : March 29, 2026 / 12:35 PM IST
Telangana Assembly
Telangana Assembly : అసెంబ్లీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య మాటల యుద్ధ తీవ్రస్థాయిలో కొనసాగింది. మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేయిచూపిస్తూ గుండాగిరి చేస్తూ బెదిరింపులకు పాల్పడినట్లు కాంగ్రెస్ సభ్యులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read : Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీలో రచ్చరచ్చ.. మంత్రి పొంగులేటిని భర్తరఫ్ చేయాలంటూ బీఆర్ఎస్ డిమాండ్..
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. దళిత వర్గానికి చెందిన కడియం శ్రీహరి మాట్లాడుతుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేయి చూపించుకుంటూ, బెదిరిస్తూ.. గుండాగిరి చేస్తూ మాట్లాడటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఇంకా ఎన్నిరోజులు దళిత వర్గానికి చెందిన మాపై దౌర్జన్యం చేస్తారు? కౌశిక్ రెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను కోరారు. పలువురు మంత్రులు సైతం కౌశిక్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేయాలని స్పీకర్ ను కోరారు.
బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. పాడి కౌశిక్ రెడ్డి చర్యలు సభ్యసమాజం తలదించుకునేదిలా ఉంది. దళితులంటే బీఆర్ఎస్‌కు లెక్కలేదు. నిన్నటి నుంచి బీఆర్ఎస్ కావాలనే సభ జరగకుండా చేస్తుంది. సభలో సీఎం స్వయంగా కమిటీ వేస్తామని చెప్పినా వినడం లేదు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పిన మారడం లేదు. హరీశ్ రావు, కేటీఆర్‌లు కౌశిక్ రెడ్డి చర్యలపై మౌనంగా ఉండటం దేనికి సంకేతం. కౌశిక్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేయాంటూ స్పీకర్ ను కోరారు.
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. కడియం శ్రీహరి పట్ల పాడికౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరు సిగ్గుచేటు. నిండు సభలో సీనియర్ శాసనసభ్యుడు కడియం శ్రీహరిపట్ల కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరుపై చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఎమ్మెల్యే పెడ్మ బొజ్జు మాట్లాడుతూ.. పాడి కౌశిక్ రెడ్డి చేష్టలతో సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. కౌశిక్ రెడ్డి చేష్టల వీడియోను రిలీజ్ చేయండి. స్పీకర్‌ను ఇబ్బంది కలిగే విధంగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్‌కు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.
ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ.. సభలో దళితులు, గిరిజనులకు రక్షణ లేదా..? హరీశ్ రావు, కేటీఆర్, బీఆర్ఎష్ నేతలు కడియం శ్రీహరికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
