×
Ad

Pending Challans : పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై భారీగా డిస్కౌంటా..? ‘ఎక్స్’లో వీడియో షేర్ చేసి క్లారిటీ ఇచ్చిన సీపీ సజ్జనార్.. చర్యలు తప్పవంటూ వార్నింగ్

VC Sajjanar : తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌట్ అంటూ ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై సీపీ సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు.

Traffic challan

  • పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై 80శాతం డిస్కౌంట్ అంటూ ప్రచారం
  • సోషల్ మీడియోలు వీడియోలు వైరల్
  • క్లారిటీ ఇచ్చిన హైదరాబాద్ సీపీ సజ్జనార్

Pending Challans : తెలంగాణ ప్రభుత్వం పలు సందర్భాల్లో మీ వాహనంపై ఉన్న పెండింగ్ చలానాల చెల్లింపునకు రాయితీలు ఇస్తుంది. గతంలో పలుసార్లు రాయితీతో ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల చెల్లింపునకు అవకాశం కల్పించింది. తద్వారా చాలా మంది వాహనదారులు వారి వాహనంపై ఉన్న చలానాను రాయితీతో ఒకేసారి చెల్లించారు. అయితే, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈనెల 14న లోక్ అదాలత్‌లో 80శాతం డిస్కౌంట్‌తో మీ వాహనంపై చలానాలను క్లియర్ చేసుకోవచ్చు అంటూ కొందరు వీడియోలు పోస్టు చేస్తున్నారు. ఈ వైరల్ వీడియోలపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పందించారు. వీడియోను తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేసి క్లారిటీ ఇచ్చారు.

Also Read : Ayatollah Ali Khamenei : ఖమేనీ బయోగ్రఫీ ఇదే.. అమెరికాకే చుక్కలు చూపించిన సుప్రీం లీడర్ చనిపోతే ఇరాన్ జనం సంబరాలు ఎందుకు?

తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌట్ అంటూ ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోల ప్రకారం.. ఈనెల 14వ తేదీన నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని.. ఈ రోజున పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు క్లియర్ చేసుకునేందుకు గొప్ప అవకాశం అంటూ వీడియోలు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అంతేకాదు.. ఈ సువర్ణావకాశం మిస్ కావొద్దంటూ సూచిస్తున్నారు. దీంతో చాలా మంది నెటిజన్లు చలాన్లపై డిస్కౌంట్ నిజమేనని నమ్ముతూ కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఈ వీడియోలపై సీసీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. ఈమేరకు తన ‘ఎక్స్’ ఖాతాలో వీడియోను షేర్ చేస్తూ అదంతా ఫేక్ ప్రచారం అంటూ క్లారిటీ ఇచ్చారు.

సజ్జనార్ ట్వీట్ ప్రకారం.. సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కక్కుర్తితో కొందరు ఎంతకైనా దిగజారుతున్నారు. మార్చి 14న లోక్ అదాలత్ సందర్భంగా ట్రాఫిక్ చలానాలపై రాయితీలు అంటూ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఆశ్చర్యకరం ఏంటంటే.. ఈ ఫేక్ సమాచారం వీడియోలకు ఏకంగా లక్షల్లో వ్యూస్ రావడం. ఇది పూర్తిగా అవాస్తవం. పోలీస్ శాఖ అధికారికంగా ఎలాంటి రాయితీలను ప్రకటించలేదు. దయచేసి ఇలాంటి ఫేక్ వీడియోలను నమ్మకండి. ఇతరులకు షేర్ చేయకండి. సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టించి, ప్రజలను తప్పుదోవ పట్టించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవు అంటూ సీపీ సజ్జనార్ హచ్చరికలు జారీ చేశారు.


సోషల్ మీడియా వేదికగా ఇలాంటి ఫేక్ ప్రచారం చేస్తూ, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని.. వారిని అరెస్టు చేసి మరొకరు ఫేక్ న్యూస్ ను సోషల్ మీడియాలో ప్రచారం చేయకుండా కట్టడి చేయాలంటూ నెటిజన్లు కోరుతున్నారు.