VC Sajjanar : ఆర్బీఐ గవర్నర్‌కు సీపీ సజ్జనార్ లేఖ.. మ్యూల్ అకౌంట్లు, బ్యాంక్ సిబ్బంది పాత్రపై ఆందోళన
VC Sajjanar : సైబర్ ముఠాలకు వరంగా మారుతున్న మ్యూల్ ఖాతాలపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ లేఖ రాశారు.
- Harishth Thanniru
- Updated on- April 21, 2026 / 07:59 PM IST
CP Sajjanar letter to RBI Governor
VC Sajjanar : సైబర్ ముఠాలకు వరంగా మారుతున్న మ్యూల్ ఖాతాలపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ లేఖ రాశారు. బ్యాంకింగ్ వ్యవస్థలో సమూల ప్రక్షాళన అవసరమని పేర్కొన్నారు. సంజయ్ మల్హోత్రాకు బ్యాంకింగ్ లోపాలపై వివరించారు. ‘ఆపరేషన్ ఆక్టోపస్’లో వెలుగుచూసిన అంశాలు.. కేవైసీ ధ్రువీకరణలో నిర్లక్ష్యంపై లేఖలో సజ్జనార్ ప్రస్తావించారు. బ్రాంచ్ అధికారుల బాధ్యత ఫిక్స్ చేయాలని ఆర్బీఐకి విజ్ఞప్తి చేశారు. కేవైసీ అమలుపై తక్షణ సిస్టమిక్ ఆడిట్ అవసరమని సజ్జనార్ పేర్కొన్నారు.
Also Read : Andhra Pradesh : ఏపీకి గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. నిధులొచ్చేశాయ్.. వారందరికీ భారీ ఊరట
దేశవ్యాప్తంగా జరుగుతున్న భారీ సైబర్ మోసాల నెట్ వర్క్ ను హైదరాబాద్ పోలీసులు తాజాగా ఛేదించిన విషయం తెలిసిందే. ‘ఆపరేషన్ ఆక్టోపస్-2’ పేరుతో తొమ్మిది రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు. బ్యాంకు అధికారులు సహా 52మందిని అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్ బ్యాంకు అధికారులు, సైబర్ నేరగాళ్లకు మధ్య ఉన్న సంబంధాలను మరోసారి బయటపెట్టిందని అధికారులు ప్రకటించారు. తాజాగా.. ఈ అంశాలను ప్రస్తావిస్తూ ఆర్బీఐ గవర్నర్ కు సజ్జనార్ లేఖ రాశారు.
మ్యూల్ అకౌంట్లలో బ్యాంక్ సిబ్బంది పాత్రపై సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ బ్యాంకుల్లో అక్రమ ఖాతాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించడం జరిగిందని, నాసిక్ ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఘటన ఉదాహరణగా సజ్జనార్ లేఖలో ప్రస్తావించారు. నకిలీ పత్రాలతో ఖాతాల ఓపెనింగ్ పై, సైబర్ నేరాలకు సహకరించిన బ్యాంక్ అధికారుల బ్లాక్ లిస్టింగ్‌కు ప్రతిపాదన చేశారు. ఆర్బీఐ, బ్యాంకులు, పోలీసులతో జాయింట్ వర్కింగ్ గ్రూప్ ను సజ్జనార్ సూచన చేశారు. అదేవిధంగా అనుమానాస్పద లావాదేవీల గుర్తింపునకు టెక్నాలజీ తప్పనిసరి అని పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. వాట్సాప్, టెలిగ్రామ్ అధిక లాభాల ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలని, డిజిటల్ అరెస్ట్ బెదిరింపులు నమ్మొద్దని ప్రజలకు సజ్జనార్ సూచన చేశారు. ఖాతాలను అద్దెకు ఇస్తే శిక్షార్హ నేరమని సజ్జనార్ హెచ్చరించారు.
ఆపరేషన్ ఆక్టోపస్ భాగంగా పోలీసులు గుర్తించిన వివరాలను సజ్జనార్ మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే. బ్యాంకు అధికారులు మోసగాళ్లతో చేతులు కలిపి నిబంధనలకు విరుద్ధంగా ఖాతాలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించినట్లు ఈ ఆపరేషన్లో తేలింది. 16 ప్రత్యేక బృందాలు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్తాన్, పశ్చిమబెంగాల్, కర్ణాటక, గుజరాత్, బిహార్‌లలో దాడులు నిర్వహించాయి. కొన్ని ప్రైవేటు బ్యాంకులు కేవైసీ నిబంధనలను తుంగలో తొక్కుతూ, సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండానే ఖాతాలు తెరవడానికి అనుమతించడం వల్లే ’మ్యూల్’ ఖాతాలు పుట్టుకొస్తున్నాయని హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ చెప్పారు.
