Credit Card Fraud : క్రెడిట్ కార్డుల నుంచి రూ. 5.50 లక్షల మోసం

క్రెడిట్ కార్డుల నుంచి లక్షలను కాజేశారు సైబర్ కేటుగాళ్లు. తాజాగా..హైదరాబాద్ మహానగరంలో ఇలాంటి మోసం ఒకటి జరిగింది. క్రెడిట్ కార్డుల నుంచి రూ. 5.50 లక్షలను కాజేశారు సైబర్ కేటుగాళ్లు. తులసిబాబు అనే వ్యక్తి సిమ్ కార్డును బ్లాక్ చేయించి..కొత్త సిమ్ కార్డు ద్వారా..సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేశారు.

Credit Card

Credit Card Fraud Hyderabad : సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అసలే కరోనా కాలంలో కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రజలు ఈ సైబర్ కేటుగాళ్లతో మరిన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా..అంతే సంగతులు. డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డుల ద్వారా ప్రజల నుంచి డబ్బులు కాజేస్తున్నారు. వారి అకౌంట్ల నుంచి తెలియకుండానే..డబ్బులు మాయం అవుతుండడంతో లబోదిబోమంటున్నారు. గిఫ్ట్, ఖరీదైన వస్తువులు వచ్చాయని, ఏదో నమ్మబలికి వారి వ్యక్తిగత సమాచారాన్ని రాబడుతున్నారు.

దీంతో వారి వారి అకౌంట్లలో ఉన్న డబ్బులను కాజేస్తున్నారు. తాజాగా..క్రెడిట్ కార్డుల నుంచి లక్షలను కాజేశారు సైబర్ కేటుగాళ్లు. తాజాగా..హైదరాబాద్ మహానగరంలో ఇలాంటి మోసం ఒకటి జరిగింది. క్రెడిట్ కార్డుల నుంచి రూ. 5.50 లక్షలను కాజేశారు సైబర్ కేటుగాళ్లు. తులసిబాబు అనే వ్యక్తి సిమ్ కార్డును బ్లాక్ చేయించి..కొత్త సిమ్ కార్డు ద్వారా..సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు.