Khammam District: ఖమ్మం జిల్లా తల్లంపాడులో టెన్షన్..టెన్షన్.. ఉప సర్పంచ్ ఎన్నికను అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు..!

దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు.

Khammam District: ఖమ్మం జిల్లా తల్లంపాడులో టెన్షన్..టెన్షన్.. ఉప సర్పంచ్ ఎన్నికను అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు..!

Updated On : December 15, 2025 / 9:58 PM IST

Khammam District: ఖమ్మం జిల్లా తల్లంపాడులో హైడ్రామా చోటు చేసుకుంది. ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించకుండా కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. తల్లంపాడులో 7 వార్డులు బీఆర్ఎస్ గెలవగా, 5 వార్డులు కాంగ్రెస్ గెలిచింది. ఉప సర్పంచ్ పదవి బీఆర్ఎస్ గెలుస్తుందని ఎన్నిక నిర్వహించకుండా కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. అయితే, ఆర్డీవో వెళ్లకుండా కారుని అడ్డుకున్నారు బీఆర్ఎస్ వార్డు మెంబర్లు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు.

ఉప సర్పంచ్ ఎన్నికను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకుంటున్న పరిస్థితి తల్లంపాడులో నెలకొంది. తల్లంపాడులో 7 వార్డులనూ బీఆర్ఎస్ గెలుచుకుంది. ఉప సర్పంచ్ పదవిని కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 10 వార్డుల్లో అత్యధికంగా 7 వార్డులు గెలవడంతో ఉపసర్పంచ్ పదవి బీఆర్ఎస్‌కే దక్కుతుందని భావించిన కాంగ్రెస్ కార్యకర్తలు.. ఎన్నిక ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల పరిశీలకుడిగా వచ్చిన ఆర్డీవో కారుని సైతం అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు రంగంలోకి దిగారు. అక్కడ పోలీసులు భారీగా మోహరించారు.

అటు బీఆర్ఎస్ శ్రేణులూ ఆందోళనకు దిగాయి. ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్డీవో కారుని వెళ్లనివ్వకుండా అడ్డంగా పడుకున్నారు. ఖమ్మం రూరల్ మండలం పాలేరు నియోజకవర్గంలో ఉంటుంది. తల్లంపాడు పంచాయతీ ఖమ్మం పట్టణానికి కూతవేటు దూరంలో ఉంటుంది. దీంతో తల్లంపాడు పంచాయతీని అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ నేతలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇరు పార్టీలో పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. అయితే అనూహ్యంగా తల్లంపాడు పంచాయతీని బీఆర్ఎస్ దక్కించుకుంది. బీఆర్ఎస్, సీపీఎం కలిసి పోటీ చేశాయి. ఇది బీఆర్ఎస్ కు కలిసి వచ్చింది. అయితే, ఉప సర్పంచ్ పదవిని తమకే ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, వార్డు మెంబర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే, అత్యధిక వార్డులు తామే గెలిచామని, ఎట్టిపరిస్థితుల్లో తమకే ఉప సర్పంచ్ పదవి ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు తేల్చి చెబుతున్నారు.

Also Read: పంచాయతీ ఎన్నికలు.. హస్తం పార్టీ ఎమ్మెల్యేల సొంతూర్లలో షాకింగ్ రిజల్ట్స్‌..! ఇందుకేనా?