Hyderabad New CP : హైదరాబాద్ సీపీగా పోస్టింగ్‌.. సంతోషంగా ఉందన్న సీవీ ఆనంద్

హైదరాబాద్ సీపీగా పోస్టింగ్ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందుతోందని, హైదరాబాద్ కమిషనర్‌గా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

Cv Anand Is Hyderabad's New Police Commissioner (1)

Hyderabad New CP : హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ప్రస్తుతం నగర పోలీసు కమిషనర్‌గా ఉన్న అంజనీ కుమార్ ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ)కు డీజీగా బదిలీ అయ్యారు. అంజనీ కుమార్ స్థానంలో సిటీ పోలీసు కమిషనర్‌గా సీవీ ఆనంద్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. తనకు హైదరాబాద్ సీపీగా పోస్టింగ్ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందుతోందని, హైదరాబాద్ కమిషనర్‌గా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. మెట్రోపాలిటన్ సిటీ‌లో శాంతి భద్రతలు చాలా ముఖ్యమని తెలిపారు. ఎన్నో సంవత్సరాల నుండి ప్రజలందరూ ఐక్యమత్యంగా ఉంటున్నారని, సైబరాబాద్ సీపీ‌గా కొనసాగినప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్ శాంతి భద్రతల మీద సమీక్ష పెట్టారని చెప్పారు. మహిళ భద్రత మీద ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందని,

డీసీపీగా 2001 నుంచి సెంట్రల్ జోన్‌గా పనిచేసినట్టు తెలిపారు.  అడిషనల్ సీపీ ట్రాఫిక్‌గా పనిచేశానని చెప్పారు. సైబర్ క్రైమ్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగిందని, అందుకే సైబర్ క్రైమ్‌పై ప్రత్యేక దృష్టిసారించనున్నట్టు సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.
డ్రగ్స్‌ వ్యవహారాలపై ఇప్పటికే నిఘా కొనసాగుతుందన్నారు. ఇంకా డ్రగ్స్‌పై అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. మహిళల భద్రతపై కూడా ఎక్కువగా దృష్టి సారిస్తామని వెల్లడించారు. గత నాలుగు ఏళ్ల నుంచి సెంట్రల్ డిప్యుటేషన్‌లో వెళ్లి వచ్చానని చెప్పారు. నూతన సంవత్సర వేడుకలను ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ముందు తీసుకెళ్తామని సీపీ ఆనంద్ పేర్కొన్నారు.

ఎక్సైజ్ డైరెక్టర్, సివిల్ సప్లై కమీషనర్‌గా సివి ఆనంద్ ‌కు 10 ఏళ్ల అనుభవం ఉంది. మావోయిస్టు ఎఫెక్టెడ్ తెలంగాణ జిల్లాలో సీవీ ఆనంద్ పనిచేశారు. 2002లో ప్రెసిడెంట్ గాలంటరీ అవార్డ్ అందుకున్నారు. అలాగే 2018లో కేంద్ర డిపుటేషన్‌పై CISFకు బదిలీ అయ్యారు.  కోవిడ్ సమయంలో IG ఎయిర్ పోర్ట్స్ విభాగంలో కీలకంగా వ్యవహరించారు ఆనంద్. క్రికేట్ క్రీడాకారునిగా స్టేట్ లెవల్ పలు కాంపిటీషన్స్‌లో సీవీ ఆనంద్ పాల్గొన్నారు. అండర్-19 విభాగంలో ఇంగ్లాండ్ టూర్‌లో పాల్గొన్నారు. ఆల్ ఇండియా పోలీస్ సింగిల్ చాంపియన్ షిప్ టెన్నీస్‌లో కూడా సీవీ ఆనంద్ విజయం సాధించారు. నేషనల్ పోలీస్ అకాడమీ‌లో బెస్ట్ అథ్లెట్ సీవీ ఆనంద్‌కు మంచి పేరుంది.

మూడేళ్ల క్రితం భారీ సంఖ్యలో బదిలీలు జరిగిన తరువాత మళ్లీ ఈ స్థాయిలో బదిలీలు చేపట్టలేదు. నగర పోలీస్ కమిషనర్‌గా నియమితులైన సీవీ ఆనంద్ 2018 ఏప్రిల్‌లో కేంద్ర సర్వీసులకు వెళ్లారు. ఆ తర్వాత మూడున్నరేళ్ల క్రితం తెలంగాణ కేడర్‌కు ఆయన బదిలీపై వచ్చారు. మరోవైపు. తెలంగాణలో భారీ ఎత్తున IPS అధికారులను బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 30 మందికి స్థానచలనం జరిగింది. హైదరాబాద్ కమిషనర్, సీనియర్ ఐపీఎస్, పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీల బదిలీలు జరిగాయి. సీనియర్ ఐపీఎస్ లు, సిద్దిపేట, నిజమాబాద్ పోలీస్ కమిషనర్లు, 11 జిల్లాల ఎస్పీల బదిలీలను ప్రభుత్వం చేపట్టింది.

Read Also : Hyderabad CP CV Anand : హైదరాబాద్ సిటీ కొత్త పోలీసు కమిషనర్‌గా సీవీ ఆనంద్..

ట్రెండింగ్ వార్తలు