Dasara Holidays : దసరాకు సొంతూళ్లకు వెళ్తున్నారా? మీ ఇంటికి తాళం వేసే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Dasara Holidays : దసరా, బతుకమ్మ పండుగలకు సొంతూళ్లకు వెళ్తున్నారా? ఇంటికి తాళం వేసే ముందు పాటించాల్సిన భద్రతా సూచనలు, దొంగతనాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Dasara Holidays

  • దసరాకు ఇంటికి తాళం వేసి వెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు
  • పండుగకు ఊరికి వెళ్లేవారికి పోలీసుల హెచ్చరిక..
  • దసరా సెలవుల్లో దొంగల బారి నుంచి మీ ఇంటిని ఇలా కాపాడుకోండి

Dasara Holidays : తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగల సందడి మొదలైంది. పండుగ సెలవులు రావడంతో చాలామంది కుటుంబాలతో కలిసి సొంతూళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. అయితే, ఇంటికి తాళం వేసి వెళ్లే ముందు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా దొంగతనాలు జరిగే అవకాశాలెక్కువ.. అందుకే ఊరికి వెళ్లే ముందు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఖాళీ ఇళ్లపై దొంగల కన్ను :
పండుగల సమయంలో చాలామంది ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోతుంటారు. దీంతో ఖాళీగా ఉన్న ఇళ్లను గుర్తించి చోరీ చేసేందుకు దొంగలు ప్రయత్నిస్తారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గ్రామాలు, కాలనీల్లో పోలీస్ నిఘాను పెంచుతున్నారు. రాత్రి వేళల్లో మొబైల్ పెట్రోలింగ్‌తో పాటు బీట్ పోలీసుల ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు.

Read Also : Pakistan Emergency : పాకిస్థాన్‌లో ఎమర్జెన్సీ ప్రకంపనలు.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ ప్రభుత్వంపై వేటు!

ఊరికి వెళ్లే ముందు ఇలా చేయండి :
ఇంటి భద్రత విషయంలో చిన్న తప్పు కూడా భారీ నష్టానికి దారితీయొచ్చు. అందుకే ప్రయాణానికి ముందే ఇంటి తలుపులు, కిటికీలు సరిగ్గా మూసి ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. గట్టి తాళాలను వాడాలి. క్యాష్, గోల్డ్, ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను ఇంట్లో వదిలి వెళ్లొద్దు. వీలైతే బ్యాంకు లాకర్లలో ఉంచుకోవడం బెటర్.

మీరు ఊరికి వెళ్తుంటే పొరుగువారికి చెప్పడం మంచిది. అవసరమైతే లోకల్ పోలీస్ స్టేషన్‌కు కూడా సమాచారం ఇవ్వండి. ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయా? వర్క్ చేస్తున్నాయో లేదో లేదో చెక్ చేసుకోండి.

సోషల్ మీడియాలో ఈ మిస్టేక్స్ చేయొద్దు :
మీరు ఇళ్లు వదిలి వెళ్లిపోతున్నారనే విషయం, ఇంటికి తాళం వేసినట్టు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు చేయొద్దు. దొంగలకు మీరు ఇంట్లో ఎవరూ లేరనే విషయాన్ని తెలిసేలా చేయొద్దు. దొంగతనాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెడుతుంటారు.

చైన్ స్నాచింగ్‌లు, టూవీలర్ వాహనాల చోరీలు, ఇళ్లలోకి చొరబడి దొంగతనాలు చేసే ప్రయత్నాలను అడ్డుకునేందుకు పెట్రోలింగ్‌ చేస్తున్నారు. మీ ఇంటి పరిసరాల్లో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. పోలీసుల సూచనలు తప్పక పాటించాలి.