Driving Licence Alert : డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారికి అలర్ట్.. వెంటనే ఈ పని చేయండి.. లేదంటే లైసెన్స్ రద్దు.. సెప్టెంబర్ 25 వరకే చాన్స్..
Driving Licence Alert : డ్రైవింగ్ లైసెన్స్‌దారులు తమ లైసెన్స్‌కు ప్రస్తుత మొబైల్ నంబర్‌ను అనుసంధానం చేసుకోవాలని, సెప్టెంబర్ 25లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని రవాణా శాఖ పేర్కొంది.
- Harish Thanniru
- Updated on- September 19, 2026 / 12:55 PM IST
Driving Licence Alert
Driving Licence Alert : దేశవ్యాప్తంగా వాహనదారులకు కేంద్ర రవాణా శాఖ కీలక సూచనలు చేసింది. డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా లింక్ చేయాలని, సెప్టెంబర్ 25లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొంది. ఇంటి నుంచే సారథి పోర్టల్ ద్వారా ఉచితంగా నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.
Also Read : AP Rains : దూసుకొస్తున్న తుఫాన్.. ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన.. అలర్ట్ జారీ..
డ్రైవింగ్ లైసెన్స్‌దారులు తమ లైసెన్స్‌కు ప్రస్తుత మొబైల్ నంబర్‌ను అనుసంధానం చేసుకోవాలని రవాణా శాఖ సూచిస్తోంది. లైసెన్స్‌లో మొబైల్ నంబర్ లేకపోయినా, పాత లేదా పనిచేయని నంబర్ నమోదై ఉన్నా వెంటనే అప్‌డేట్ చేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. సెప్టెంబర్ 25లోపు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని వెల్లడిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే లైసెన్స్ లు రద్దవుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇంటి నుంచే సారథి పోర్టల్ ద్వారా ఉచితంగా మొబైల్ నెంబర్ లింక్, అప్డేట్ చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు.
డ్రైవింగ్ లైసెన్స్‌కు సరైన మొబైల్ నంబర్ అనుసంధానం కాకపోవడం వల్ల ఈ-చలాన్లు, లైసెన్స్ పునరుద్ధరణకు సంబంధించిన సమాచారం, ఓటీపీలు, ఇతర రవాణా శాఖ నోటిఫికేషన్లు సకాలంలో అందకపోయే అవకాశం ఉంటుంది. పాత లైసెన్స్‌లలో మొబైల్ నంబర్లు లేకపోవడం, కొందరి రికార్డుల్లో పాత నంబర్లు ఉండటంతో ఈ సమస్యలు తలెత్తుతున్నాయని రవాణా శాఖ పేర్కొంది.
ఇంట్లో ఉండే లింక్ చేసుకోవచ్చు
♦ మొదట మొబైల్‌లో లేదా కంప్యూటర్‌లో సారథి పరివాహన్ పోర్టల్ (sarathi.parivahan.gov.in) ఓపెన్ చేయండి
♦ తరువాత ఆంధ్రప్రదేశ్/తెలంగాణ ఆప్షన్‌ను ఎంచుకోండి
♦ హోమ్ పేజీలో ఉన్న ‘అదర్స్ మెనూ’లోకి వెళ్లండి
♦ అందులో ‘మొబైల్ నంబర్ అప్‌డేట్’పైన నొక్కండి
♦ డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు, పుట్టిన తేదీ ఎంటర్ చేయండి
♦ అన్నీ వివరాలు సరిగ్గా ఉన్నయో లేదో చూసుకోండి
♦ ఇప్పుడు అప్‌డేట్ చేయాల్సిన కొత్త మొబైల్ నంబర్‌ను సబ్మిట్ చేయండి.
♦ చివర్లో ఓటీపీ ఎంటర్ చేస్తే ప్రక్రియ పూర్తవుతుంది
