Pani Puri Food Poison : పానీ పూరి చూడగానే లొట్టలేస్తున్నారా… అయితే ఒక్కసారి ఈ 15 మంది పరిస్థితి తెలుసుకొండి.. ఆ తర్వాత మీ ఇష్టం..!
Pani Puri Food Poison : పానీ పూరి అనగానే లొట్టలేసుకుంటూ వెళ్లేవారు ఒక్క నిమిషం ఆగి ఇది చదవండి.
- Dharani Pilli
- Updated on- May 27, 2026 / 04:28 PM IST
due to pani puri food poison 15 members hospitalized in jogulamba gadwal district
- జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం
- పానీ పూరి తిని 15 మంది విద్యార్థినీలకు అస్వస్థత
- కేసు నమోదు చేసిన పోలీసులు
Pani Puri Food Poison : పానీ పూరి.. ఇది మన జీవితాల్లో ఓ భాగం అయ్యింది. మన తెలుగు వారి ఆహారం కాకపోయినా.. మనందరి ఇష్టమైన చిరుతిండిగా మారింది. పానీ పూరి చూడగానే నోట్లో నీళ్లూరుతుంటాయి. పానీ పూరి అశుభ్రత గురించి ఎవరు ఎంత మంది ఎలా చెప్పినా.. పానీ పూరి లవర్స్ మాత్రం తమ మనసు మార్చుకోరు. పానీ పూరి బండి కనిపించిందా ఓ పట్టు పట్టాల్సిందే. మరి మీరు కూడా పానీ పూరి లవర్సా.. అయితే ఈ సారి పానీ పూరి తినేముందు.. ఒక్కసారి ఈ 15 మందికి ఏం జరిగిందో తెలుసుకోండి. ఆ తర్వాత తినాలా వద్దా మీరే నిర్ణయించుకోండి.
తాజాగా పానీపూరి తిని ఫుడ్ పాయిజనింగ్ జరిగి 15 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఈ సంఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాలోని అయిజ పట్టణంలో మంగళవారం సాయంత్రం కొందరు విద్యార్థులు సరదాగా బయటకు వెళ్లి స్థానికంగా ఉన్న ఓ దుకాణం వద్ద పానీ పూరి తినాలని వెళ్లారు. పానీ పూరి ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత ఎవరింటికి వారు వెళ్లారు. కొన్ని గంటలు గడిచాక.. అంటే మంగళవారం రోజు రాత్రి 7 గంటల ప్రాంతంలో పానీ పూరీ తిన్న విద్యార్థులంతా ఒక్కొక్కరిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కొందరికి కడుపునొప్పి, మరి కొందరికి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి.
*పానీ పూరి బండి నుండి థార్ కారు వరకు.. బీటెక్ చదివిన అమ్మాయి సక్సెస్ స్టోరీ షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
పిల్లల పరిస్థితి చూసిన తల్లిదండ్రులు వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా ఒకే షాపు వద్ద పానీ పూరి తిన్నారని తెలిసింది. వీరు తిన్న పానీ పూరిలో కలుషిత నీరు, నాణ్యతలేని పదార్థాలతో తయారు చేసి ఉండవచ్చని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 15 మంది విద్యార్థినులను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీరిలో కొందరి ఆరోగ్యం మెరుగవ్వగా.. మరి కొందరికి ఇంకా చికిత్స అందిస్తున్నారు.
*మహాభారత కాలంలో పానీ పూరి.. ద్రౌపది కనిపెట్టిందట
ఈ విద్యార్థినులకు పానీ పూరి అమ్మిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఆ పానీ పూరి షాపు వద్దకు చేరుకుని యజమానితో పాటు బండిని కూడా పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ బండి మీద పదార్థాల శాంపిల్స్ ల్యాబ్‌కి పంపించామని అన్నారు. దీనిపై విచారణ చేస్తున్నట్లు ఎస్సై మల్లేశ్ తెలిపారు.
