Anand Mahindra : పానీ పూరి బండి నుండి థార్ కారు వరకు.. బీటెక్ చదివిన అమ్మాయి సక్సెస్ స్టోరీ షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

బీటెక్ చదివి పానీ పూరి వ్యాపారం చేస్తున్న యువతి థార్ కారు కొనే స్ధాయికి చేరుకుంది. ఆ యువతికి విజయగాథ ఆనంద్ మహీంద్రాకు ఎంతగానో నచ్చింది. ఆ యువతి ఎవరో చదవండి.

Anand Mahindra  : పానీ పూరి బండి నుండి థార్ కారు వరకు.. బీటెక్ చదివిన అమ్మాయి సక్సెస్ స్టోరీ షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

Anand Mahindra

Updated On : January 24, 2024 / 3:23 PM IST

Anand Mahindra : చదువు బీటెక్.. పని రోడ్ సైడ్ పానీ పూరి వ్యాపారం. ఇప్పుడు థార్ కారు కొనేంత స్ధాయి. ఓ యువతి విజయగాథ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రాకి స్ఫూర్తి కలిగించింది. ఆ యువతి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసారు ఆనంద్ మహీంద్రా.

Anand Mahindra : పిల్లల్ని ఇలా తయారు చేస్తున్నామా?.. ఆలోచింపచేస్తున్న ఆనంద్ మహీంద్రా ట్వీట్

సాధారణమైన స్ధాయి నుండి తమ కలలు సాకారం చేసుకున్న ఎందరో వ్యక్తుల స్ఫూర్తిదాయకమైన కథలను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా ఆయన షేర్ చేసిన ఓ వీడియో చాలామందిలో స్ఫూర్తి నింపింది. తాప్సీ ఉపాధ్యాయ్ బీటెక్ చదువుకున్నా పానీ పూరి వ్యాపారం మొదలుపెట్టి కొత్త మహీంద్రా థార్ SUV సొంతం చేసుకునే స్ధాయికి ఎదిగింది. ఆమెలోని దృఢ సంకల్పం ఆనంద్ మహీంద్రాకి ఎంతో నచ్చింది. ‘ప్రజలు ఎదగడానికి వారి కలలను సాకారం చేసుకోవడానికి మా కార్లు సహాయపడాలని కోరుకుంటున్నాను.. నేను ఈ వీడియోను ఎందుకు ఇష్టపడుతున్నానో ఇప్పుడు మీకు తెలుసు’ అంటూ ఆనంద్ మహీంద్రా వీడియోను షేర్ చేశారు.

Anand Mahindra : 12th ఫెయిల్ సినిమాపై ఆనంద్ మహీంద్రా రివ్యూ.. యే దిల్ మాంగే మోర్.. అంటూ..

వీడియోలో తాప్సీ తన పానీ పూరి బండిని తన కొత్త థార్ కారుకి తగిలించుకుని తను వ్యాపారం చేసే చోటుకి తీసుకురావడం వీడియోలో కనిపించింది. వీడియోలో తాను రాత్రికి రాత్రి వైరల్ కాలేదని.. తానీ రోజు ఈ స్థితికి రావడం వెనుక ఎంతో కష్టం ఉందని తాప్సీ చెప్పారు. పానీ పూరి కోసం వాడే ప్రతి పదార్ధం విషయంలో ఎంత కేర్ తీసుకుంటారో కూడా వీడియోలో ఎక్స్ ప్లైన్ చేసారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా తాప్సీ చేస్తున్న పానీ పూరి వ్యాపారానికి సంబంధించి 40 బ్రాంచ్ లు ప్రారంభించారట. ఇక తాప్సీ బండి దగ్గర పానీ పూరీల కోసం జనం ఎగబడతారట. ఇదంతా వినడానికి బాగానే ఉంది. దీని వెనుక తాప్సీ కష్టం ఎంతో ఉంది. ఒక్కోసారి చదువుకున్న చదువుకి చేసే పనికి సంబంధం ఉండదు అంటారు. ఎవరు ఎందులో విజయం సాధిస్తారో కూడా చెప్పలేం. తాప్సీ ఉపాధ్యాయ్ అంటే చాలామందికి తెలియదండోయ్.. బీటెక్ పానీ పూరీ వాలీ అంటేనే ఎంతో గుర్తింపు. తాప్సీ చాలామందికి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.