Anand Mahindra : 12th ఫెయిల్ సినిమాపై ఆనంద్ మహీంద్రా రివ్యూ.. యే దిల్ మాంగే మోర్.. అంటూ..

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా తాజాగా '12th ఫెయిల్' సినిమాపై స్పందించారు. ఈ సినిమా గురించి ఆయన పెట్టిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Anand Mahindra : 12th ఫెయిల్ సినిమాపై ఆనంద్ మహీంద్రా రివ్యూ.. యే దిల్ మాంగే మోర్.. అంటూ..

Anand Mahindra

Anand Mahindra : వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రాకి ’12th ఫెయిల్’  సినిమా ఎంతగానో నచ్చేసింది. ఈ సంవత్సరం ఒకే ఒక్క సినిమా చూడాలనుకుంటే ఈ సినిమాను తప్పకుండా చూడండి అని సూచించారు. జాతీయ అవార్డు పొందడానికి కావాల్సిన అన్ని అర్హతలు నటుడు విక్రాంత్ మస్సేకి ఉన్నాయని  ప్రశంసిస్తూ రివ్యూ ఇచ్చారు ఆనంద్ మహీంద్రా.

Shah Rukh Khan : ఒకేసారి మూడు సినిమాలు ప్రకటించే పనిలో షారుఖ్.. డిఫరెంట్ జోనర్స్‌తో..

విధు వినోద్ చోప్రా డైరెక్షన్‌లో విక్రాంత్ మస్సే నటించిన ’12th ఫెయిల్’ సినిమా అందరి ప్రశంసలు పొందుతోంది. ప్రముఖ ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ సినిమాపై ఇప్పటికే అలియా భట్, దీపికా పదుకోన్ వంటి వారు ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సినిమాను రీసెంట్‌గా టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా చూసారట. అద్భుతమైన సినిమా అని విక్రాంత్‌ను అభినందిస్తూ సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి రివ్యూ ఇచ్చారాయన.

పేదరికాన్ని అధిగమించి మనోజ్ కుమార్ శర్మ ఐపీఎస్ ఆఫీసర్‌గా ఎలా ఎదిగారన్నది  చిత్ర కథ. మనోజ్ కుమార్ పాత్రలో నటించిన విక్రాంత్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆనంద్ మహీంద్రా తన పోస్టులో ‘ఈ సంవత్సరం ఒకే ఒక్క సినిమా చూడాలనుకుంటే ఈ సినిమా చూడండి ఎందుకంటే? అంటూ నంబర్ల వారీగా వివరణ ఇచ్చారు.

1. కథాంశం: ఈ కథ దేశంలోని నిజ జీవిత హీరోల ఆధారంగా రూపొందించబడింది. విజయం కోసం ఆకలితో ఉన్న లక్షలాది మంది యువత  పోటీ పరీక్షలకు ఎదురొడ్డి పోరాడుతున్నారు.

2. నటన: ఈ సినిమాలోని నటీనటులు అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ప్రతి పాత్ర గంభీరంగా, ఉద్వేగ భరితంగా చిత్రీకరించారు.. కానీ విక్రాంత్ మస్సే నటన జాతీయ అవార్డుకు అర్హమైనది. తను నటించలేదు.. జీవించినట్లు అనిపించింది.

3. కథ శైలి:  గొప్ప సినిమా అంటే గొప్ప కథల నుండి వస్తాయి అని విధు చోప్రా ఈ సినిమా ద్వారా స్పష్టం చేశారు. ఇంటర్వ్యూ సీన్ హైలైట్‌గా నిలిచింది. కొంచెం కల్పితంగా అనిపించినా లోతైన సంభాషణలు ఆకట్టుకుంటాయి. నవ భారత నిర్మాణానికి  నేటి యువతకు ఏమి చేయాలో ఈ సినిమా చెబుతుంది. మిస్టర్ చోప్రా.. యే దిల్ మాంగే మోర్’ అంటూ సుదీర్ఘంగా ట్వీట్ చేసారు ఆనంద్ మహీంద్రా.

Telugu Titans : సినీ న‌టుడు బాల‌కృష్ణ నివాసంలో తెలుగు టైటాన్స్ ఆట‌గాళ్ల సంద‌డి..

ఆనంద్ మహీంద్రా ట్వీట్‌కు విక్రాంత్ మస్సే స్పందించారు. ‘మీలాంటి గొప్పవారి అభినందనలు అందుకోవడం సంతోషంగా ఉందని’ రిప్లై ఇచ్చారు. 2023 లో వచ్చిన బెస్ట్ మూవీ అంటూ నెటిజన్లు సైతం తమ కామెంట్లలో పేర్కొన్నారు. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్ అవుతోంది.