Shah Rukh Khan : ఒకేసారి మూడు సినిమాలు ప్రకటించే పనిలో షారుఖ్.. డిఫరెంట్ జోనర్స్‌తో..

షారుఖ్ షారుఖ్ గత ఏడాది హ్యాట్రిక్ హిట్స్ కొట్టినట్లే.. ఈ ఏడాది కొత్త మూవీ అనౌన్స్‌మెంట్స్ ని కూడా ఇవ్వడానికి సిద్దమవుతున్నారట. ఒకేసారి మొత్తం మూడు ప్రాజెక్ట్స్..

Shah Rukh Khan : ఒకేసారి మూడు సినిమాలు ప్రకటించే పనిలో షారుఖ్.. డిఫరెంట్ జోనర్స్‌తో..

Shah Rukh Khan planing a three new projects in three different genres

Shah Rukh Khan : బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ మూడు సూపర్ హిట్స్ ని అందుకున్నారు. ‘పఠాన్’తో 1000 కోట్ల బ్లాక్ బస్టర్ ని అందుకొని షారుఖ్.. ఆ వెంటనే ‘జవాన్’తో వచ్చి అంతకు మించి హిట్టుతో 1100 కోట్లతో సంచలనం సృష్టించారు. ఇక చివరిగా ‘డంకీ’తో వచ్చి 460 కోట్లకు పైగా కలెక్షన్స్ ని నమోదు చేసి సూపర్ హిట్టునే సొంతం చేసుకున్నారు.

గత ఏడాది వరుస సినిమాలతో భారీ కమ్‌బ్యాక్ ఇచ్చి అభిమానులను ఫుల్ ఖుషి చేసిన షారుఖ్.. ఈ ఏడాది సినిమా రిలీజ్ ల విషయం కాదుగా, అసలు తదుపరి చిత్రాల అప్డేట్స్ కూడా లేవు. ప్రస్తుతం షారుఖ్ సినిమాలకు కొంచెం బ్రేక్ ప్రకటించి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు. అయితే ఈ ఇయర్ స్టార్ట్ అయ్యి అప్పుడే ఒక నెల పూర్తి అయ్యిపోవస్తుంది. కానీ షారుఖ్ నుంచి కొత్త సినిమా గురించి ఏ అప్డేట్ లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.

Also read : HanuMan : తేజ సజ్జను సత్కరించిన కిషన్ రెడ్డి.. ‘హనుమాన్’ సక్సెస్‌పై ట్వీట్

అయితే షారుఖ్ మాత్రం గత ఏడాది హ్యాట్రిక్ హిట్స్ లాగానే.. ఈ ఏడాది అనౌన్స్‌మెంట్స్ కూడా ఇవ్వడానికి సిద్దమవుతున్నారట. ఒకేసారి మొత్తం మూడు ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేసి ఫ్యాన్స్ ని థ్రిల్ చేయడానికి రెడీ అవుతున్నట్లు బాలీవుడ్ ఫిలిం సర్కిల్ లో వినిపిస్తున్న టాక్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన చర్చలు దర్శకనిర్మాతలతో జరుగుతున్నట్లు సమాచారం.

ఇక ఈ మూడు ప్రాజెక్ట్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ లో ఉండబోతున్నాయంటూ తెలుస్తుంది. వీటిలో రెండు ప్రాజెక్ట్స్ కి సంబంధించిన న్యూస్ కూడా వినిపిస్తుంది. ఒక మూవీ పూర్తి యాక్షన్ తో రాబోతుందట. ఇక మరో చిత్రం మాత్రం ‘డంకీ’ మాదిరి ఫీల్ గుడ్ తో మెసేజ్ ఓరియంటెడ్ గా రూపొందబోతుందట. ఈ నెలాఖరుకి ఈ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ ఉండబోతుందంటూ తెలుస్తుంది.