Telugu Titans : సినీ నటుడు బాలకృష్ణ నివాసంలో తెలుగు టైటాన్స్ ఆటగాళ్ల సందడి..
సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నివాసంలో తెలుగు టైటాన్స్ ప్లేయర్లు సందడి చేశారు.

Nandamuri Balakrishna wishes Telugu Titans
Telugu Titans – Nandamuri Balakrishna : సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నివాసంలో తెలుగు టైటాన్స్ ప్లేయర్లు సందడి చేశారు. ప్రో కబడ్డీ లీగ్ సీజన్10లో కొన్ని మ్యాచులకు హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. జనవరి 19 నుంచి ఈ మ్యాచులు నగరంలో ఆరంభం కానున్నాయి. గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో బెంగళూరు బుల్స్‌తో శుక్రవారం తెలుగు టైటాన్స్ తలపడనుంది. ఈ క్రమంలో మ్యాచ్ ఆడేందుకు ఆటగాళ్లు హైదరాబాద్ చేరుకున్నారు.
ఈ క్రమంలో బాలయ్య నివాసానికి తెలుగు టైటాన్స్ ఆటగాళ్లు వెళ్లారు. ఆయన్ను కలుసుకుని తెలుగు టైటాన్స్ జెర్సీని అందజేశారు. శుక్రవారం జరిగే మ్యాచ్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు. బాలయ్యను కలుసుకున్న వారిలో తెలుగు టైటాన్స్ కెప్టెన్ పవన్ షెరావత్, కోచ్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఆటగాళ్లతో కలిసి బాలయ్య తొడకొట్టారు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అదే సమయంలో కెప్టెన్ షెరావత్‌తో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో హల్ చేస్తుంది.
Suryakumar Yadav : హాస్పిటల్ బెడ్ పై సూర్యకుమార్ యాదవ్.. ఎందుకంటే..?
స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రోకబడ్డీ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న నటుడు బాలకృష్ణ తెలుగు టైటాన్స్ ఆటగాళ్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. గెలుపు జోష్‌ను కొనసాగించాలన్నారు. కబడ్డీ అభిమానులందరూ ఒక్కతాటిపైకి వచ్చి జట్టుకు మద్దతు ఇవ్వాలని కోరారు.
అనంతరం తెలుగు టైటాన్స్ కెప్టెన్ పవన్ షెరావత్ మాట్లాడుతూ.. సొంత మైదానంలో ఆడేందుకు తాము ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. అభిమానుల మద్దతు, ప్రోత్సాహమే తమను ముందుకు నడిపిస్తాయని, విజయమే లక్ష్యంగా మ్యాచులను ఆడుతామన్నాడు.
ఒకే ఒక్క విజయం..
ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌లో తెలుగు టైటాన్స్ ఆటతీరు చాలా పేలవంగా ఉంది. ఇప్పటి వరకు 12 మ్యాచులు ఆడింది. కేవలం ఒకే ఒక్క మ్యాచులో గెలుపొందింది. 10 పాయింట్ల జట్టు ఖాతాలో ఉన్నాయి. పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. జైపూర్ పింక్ పాంథర్స్ 14 మ్యాచులు ఆడగా 10 మ్యాచుల్లో గెలిచి 58 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఆ తరువాత పుణేరి ఫల్లాన్ సెకండ్, దబాంగ్ ఢిల్లీ లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
Team India : చరిత్ర సృష్టించిన టీమ్ఇండియా.. ధోని విజయాల రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ శర్మ
View this post on Instagram