Team India : చ‌రిత్ర సృష్టించిన టీమ్ఇండియా.. ధోని విజ‌యాల రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన రోహిత్ శ‌ర్మ‌

టీ20ల్లో భార‌త జ‌ట్టు అద‌ర‌గొడుతోంది.

Team India : చ‌రిత్ర సృష్టించిన టీమ్ఇండియా.. ధోని విజ‌యాల రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన రోహిత్ శ‌ర్మ‌

Team India

Updated On : January 17, 2024 / 11:46 PM IST

Team India : టీ20ల్లో భార‌త జ‌ట్టు అద‌ర‌గొడుతోంది. బెంగ‌ళూరు వేదిక‌గా అఫ్గానిస్తాన్‌తో జ‌రిగిన మూడో టీ20 మ్యాచులో విజ‌యం సాధించిన టీమ్ఇండియా ఓ అరుదైన రికార్డును నెల‌కొల్పింది. మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ క్ర‌మంలో టీ20 క్రికెట్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక సార్లు ప్ర‌త్య‌ర్థుల‌ను వైట్‌వాష్ లు చేసిన జ‌ట్టుగా టీమ్ఇండియా స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింది. అఫ్గానిస్తాన్‌తో సిరీస్ క‌లిపి 9 సార్లు ప్ర‌త్యర్థుల‌ను భార‌త్ వైట్‌వాష్ చేసింది. ఈ క్ర‌మంలో పాకిస్తాన్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టింది. దైపాక్షిక సిరీసుల్లో పాకిస్తాన్ 8 సార్లు ప్ర‌త్య‌ర్థుల‌ను క్లీన్‌స్వీప్ చేసింది.

అత్య‌ధిక విజ‌యాలు సాధించిన భార‌త కెప్టెన్‌గా..

ఈ మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు విజ‌యం సాధించ‌డంతో రోహిత్ శ‌ర్మ ఓ అరుదైన రికార్డును అందుకున్నాడు. టీ20ల్లో టీమ్ఇండియాకు అత్య‌ధిక విజ‌యాలు అందించిన సార‌థిగా రికార్డుల‌కు ఎక్కాడు. 42 మ్యాచుల్లో రోహిత్ భార‌త్‌కు విజ‌యాల‌ను అందించాడు. ఈ ఘ‌న‌త సాధించేందుకు హిట్‌మ్యాన్‌కు కేవ‌లం 54 మ్యాచులు మాత్ర‌మే అవ‌స‌రం అయ్యాయి. ధోని 72 టీ20 మ్యాచుల్లో 41 విజ‌యాలు అందించాడు. ఇక విరాట్ కోహ్లి సార‌థ్యంలో టీమ్ఇండియా 30 మ్యాచుల్లో గెల‌వ‌గా హార్దిక్ పాండ్యా నాయ‌క‌త్వంలో 10 మ్యాచుల్లో విజ‌యం సాధించింది.

Sania Mirza : ఏదీ క‌ష్టం.. పెళ్లి చేసుకోవ‌డ‌మా ? విడాకులు తీసుకోవ‌డ‌మా ?

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. డ‌బుల్ సూప‌ర్ ఓవ‌ర్‌కు దారి తీసిన ఈ మ్యాచ్‌లో భార‌త్ 10 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. మ్యాచులో మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయిన 212 ప‌రుగులు చేసింది. భారత బ్యాట‌ర్ల‌లో రోహిత్ శ‌ర్మ(121నాటౌట్; 69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స‌ర్లు) సెంచ‌రీ చేయ‌గా రింకూ సింగ్ (69 నాటౌట్; 39 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) అర్ధ‌శ‌త‌కంతో రాణించాడు. అఫ్గానిస్తాన్ బౌల‌ర్ల‌లో ఫరీద్ అహ్మద్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా అజ్మతుల్లా ఒమర్జాయ్ ఓ వికెట్ సాధించాడు.

అనంత‌రం గుల్బాదిన్ నాయబ్ (55 నాటౌట్‌; 23 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స‌ర్లు), ర‌హ్మానుల్లా గుర్బాజ్ (50; 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స‌ర్లు), ఇబ్ర‌హీం జ‌ద్రాన్ (50; 41 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్) హాఫ్ సెంచ‌రీలు చేయ‌డంతో అఫ్గానిస్తాన్ ల‌క్ష్య‌ఛేద‌న‌లో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు కోల్పోయి స‌రిగ్గా 212 ప‌రుగులు చేసింది. దీంతో మ్యాచ్ సూప‌ర్ ఓవ‌ర్‌కు దారి తీసింది.

ICC T20I Rankings : టీ20 ర్యాంకింగ్స్‌.. భారత ఆట‌గాళ్ల హవా.. య‌శ‌స్వి జైస్వాల్‌ 7, శివ‌మ్ దూబె 207 స్థానాలు ఎగ‌బాకి..

అనంత‌రం సూప‌ర్ ఓవ‌ర్‌లో అఫ్గాన్ 16 ప‌రుగులు చేసింది. ఆ త‌రువాత బ్యాటింగ్ దిగిన భార‌త్ కూడా 16 ప‌రుగులే చేయ‌డంతో మ్యాచ్ మ‌రో సూప‌ర్ ఓవ‌ర్‌కు దారి తీసింది. రెండో సూప‌ర్ ఓవ‌ర్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త్ 11 ప‌రుగులు చేయ‌గా అఫ్గాన్ మూడు బంతుల్లో ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేసి రెండు వికెట్లు కోల్పోవ‌డంతో 10 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది.