Anand Mahindra : పిల్లల్ని ఇలా తయారు చేస్తున్నామా?.. ఆలోచింపచేస్తున్న ఆనంద్ మహీంద్రా ట్వీట్

పసిపిల్లలు స్మార్ట్ ఫోన్‌కి అడిక్ట్ అవుతున్నారు. చేతిలో ఉన్నది తినే ఆహారమా? సెల్ ఫోనా? పోల్చుకోలేనంత కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో అందర్నీ ఆలోచింపచేస్తోంది.

Anand Mahindra  : పిల్లల్ని ఇలా తయారు చేస్తున్నామా?.. ఆలోచింపచేస్తున్న ఆనంద్ మహీంద్రా ట్వీట్

Anand Mahindra

Anand Mahindra : ఓ చిన్నారి తన చేతిలో ఉన్నది తినే ఆహారమా? సెల్ ఫోనా? తికమక పడ్డాడు. పసిపిల్లలకు సెల్ ఫోన్ ఒక వ్యసనంలా మారుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రాను ఆకర్షించింది. ఆయన షేర్ చేసిన వీడియో ఆందర్నీ ఆలోచనలో పడేసింది.

Anand Mahindra : 12th ఫెయిల్ సినిమాపై ఆనంద్ మహీంద్రా రివ్యూ.. యే దిల్ మాంగే మోర్.. అంటూ..

ఒకప్పుడు పాటలు పాడుతూ.. కథలు చెబుతూ అమ్మలు తమ బిడ్డలకు అన్నం తినిపించేవారు. ఇల్లంతా తిరుగుతూ అల్లరి చేసినా భరించేవారు. ఇప్పుడంతా మారిపోయింది. పిల్లలు అన్నం తినకుండా విసిగిస్తే ఓర్చుకునేంత సహనం ఉండట్లేదు. వారి అల్లరిని కట్టడి చేయడానికి ఆయుధం దొరికింది. అదే సెల్ ఫోన్. కాసేపు వారి అల్లరిని ఆపగలుగుతోంది కానీ.. దాని పర్యవసానం ఏంటో ఎవరికీ పట్టట్లేదు. చిన్నవయసులో సెల్ ఫోన్‌కి ఎడిక్ట్ అయిపోతున్న చిన్నారులు ఎందరో ఉన్నారు. సోషల్ మీడియాలో ఓ వీడియో ఇప్పుడు అందర్నీ ఆలోచనలో పడేసింది.

ఒక మహిళ తన బిడ్డకి తినడానికి ఎదురుగా ఏదో ఉంచింది. చూడటానికి అది సెల్ ఫోన్ ఆకారంలో ఉంది. కాసేపు అదేంటో తెలియక కన్ఫ్యూజ్ అయిన చిన్నారి చివరికి సెల్ ఫోన్ అనుకుని చెవి దగ్గర పెట్టుకోవడం వీడియోలో కనిపించింది. ఈ వీడియోని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేసారు. ‘మానవుల జీవితాలు ఎంతలా మారిపోయాయంటే ఫోన్ తర్వాతే.. తిండి, బట్ట, ఇల్లు’ అన్నట్లు’ అనే శీర్షికతో ఆయన షేర్ చేసిన వీడియో అందర్నీ ఆలోచనలో పడేసింది. ఈ పోస్టు చూసిన నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేసారు. ఇది ప్రమాదకరమైన ధోరణి అంటూ కామెంట్స్ చేసారు.

Anand Mahindra : 97 ఏళ్ల బామ్మ సాహసం చూసారా? నా హీరో.. అంటూ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

పసివయసులోనే పిల్లలు సెల్ ఫోన్‌కి అడిక్ట్ అవుతున్నారు. ఇది వారికి ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ 2020 లో చేసిన సర్వేలో 60% మంది 5 సంవత్సరాల కంటే తక్కువ వయసులో ఉన్న పిల్లలు స్మార్ట్ ఫోన్‌కి అడిక్ట్ అవుతున్నట్లు తేలింది. ఇంత చిన్న వయసులో సెల్ ఫోన్‌కి అడిక్ట్ అయిన పిల్లలు ప్రవర్తన సమస్యలు ఎదుర్కుంటున్నారని పరిశోధకులు కనుగొన్నారు.