Anand Mahindra : 97 ఏళ్ల బామ్మ సాహసం చూసారా? నా హీరో.. అంటూ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్ర 97 ఏళ్ల వృద్ధురాలి వీడియో షేర్ చేశారు.. ఆ వీడియోలో ఆ పెద్దావిడ చేసిన సాహసం చూస్తే ఔరా అంటారు.

Anand Mahindra : 97 ఏళ్ల బామ్మ సాహసం చూసారా? నా హీరో.. అంటూ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

Anand Mahindra

Anand Mahindra : ఏజ్ అనేది జస్ట్ నంబర్ మాత్రమే.. మనసు ఉల్లాసంగా ఉండాలి కానీ అని అంటూ ఉంటారు. ఓ 97 ఏళ్ల వృద్ధురాలిని చూస్తే ఆ మాటలు నిజమనిపిస్తాయి. వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు.

Anand Mahindra : ఆనంద్ మహీంద్రాకు బాధ కలిగించిన వీడియో.. అందులో ఏముందంటే?

ఆనంద్ మహీంద్రా 97 సంవత్సరాల పెద్దావిడ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఇంతకీ ఆవిడ ఏం చేసింది? అంటే.. ఆ వయసులో ఎవరూ చేయలేని సాహసం చేసిందని చెప్పాలి. ఓ శిక్షకుడి సాయంతో పారా-మోటరింగ్ చేస్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది. ఎంతో ఉత్సాహంగా పారా-మోటరింగ్ చేస్తూ గాల్లో ఎగురుతూ కనిపించింది. ఆమె ధైర్యానికి సెల్యూట్ చేయాల్సిందే. ఆమె ఉత్సాహాన్ని స్ఫూర్తిగా తీసుకోవాల్సిందే.

Anand Mahindra : ఈ ట్రాక్టర్ ఎందుకిలా ఉంది? ఈ డౌట్ ఆనంద్ మహీంద్రాకే కాదు మీకూ వస్తుంది

‘ఎగరడం ఆలస్యం కాదు.. ఆమె ఈరోజు నా హీరో’ అనే క్యాప్షన్‌తో ఆనంద్ మహీంద్రా ఆ పెద్దావిడ పోస్టును తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసారు. ఈ క్లిప్ నిజానికి ఇన్‌స్టాగ్రామ్ పేజీ ‘ఫ్లయింగ్ రైనో పారా-మోటరింగ్’ లో పోస్టు చేయబడింది. ‘ఆర్మీ పారా-కమాండో పైలట్లు, అనుభవజ్ఞులైన వైమానిక దళ సిబ్బంది’ దీనిని నడుపుతున్నట్లు పేజీ బయోలో వివరించారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది నెటిజన్లు ‘ఆమె ధైర్యం, జీవిత అభిరుచి మనం కూడా ప్రేరణగా తీసుకోవాలి’ .. ‘వయస్సు అనేది కేవలం ఒక నంబర్, ఒక వృద్ధురాలు నిర్భయంగా పారాగ్లైడింగ్‌ని చేస్తున్న ఈ వీడియో దానిని రుజువు చేసింది’ అని కామెంట్లు పెట్టారు.